gold లండన్ నుండి టన్నులకొద్దీ బంగారం అమెరికాకు: ట్రంప్ దెబ్బ మామూలుగా లేదుగా!

Published : Feb 19, 2025, 07:41 AM IST

ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కిన తర్వాత ఆయన తీసుకుంటున్న దుందుడుకు చర్యలతో ప్రపంచవ్యాప్తంగా పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ట్రంప్ నిర్ణయంతో ఇంగ్లాండ్ రాజధాని లండన్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుండి అమెరికా బ్యాంకులు టన్నుల కొద్దీ బంగారాన్ని న్యూయార్క్‌కు తరలిస్తున్నాయి. దీనికి గల కారణాలను ఇక్కడ వివరంగా చూద్దాం.

PREV
13
gold లండన్ నుండి టన్నులకొద్దీ బంగారం అమెరికాకు: ట్రంప్ దెబ్బ మామూలుగా లేదుగా!
బంగారాన్ని తరలిస్తున్న అమెరికా బ్యాంకులు

ట్రంప్ పన్ను సుంకాలు, మాటల తెంపరితనంతో గతంలో ఎన్నడూ లేనంతగా అమెరికాతో కొన్ని ఐరోపా దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో, అమెరికా బ్యాంకులు లండన్ నుండి టన్నుల కొద్దీ బంగారాన్ని అమెరికాకు తరలిస్తున్నాయి.  

23
అమెరికా బ్యాంకులు

ఐరోపా దేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై ట్రంప్ పరస్పర పన్ను విధించనున్నట్లు ప్రకటించడంతో ఈ విరోధ వాతావరణం నెలకొంది. ఆ దేశాలు సైతం సుంకాలు విధిస్తాయనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఐరోపాలో అమెరికా బ్యాంకులు దాచిన బంగారంపై కూడా భారీ సుంకం ఉంటుందని అంతా భావిస్తున్నారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా లండన్ నుండి బంగారాన్ని తరలిస్తున్నాయి పలు బ్యాంకులు.

33
లండన్ బంగారం నిల్వ కేంద్రం

పురాతన కాలం నుంచి లండన్ బంగారం నిల్వ చేసేందుకు ఒక సురక్షిత నగరం ఉంది. అమెరికా, ఇంగ్లండ్ల మధ్య మొదట్నుంచీ వ్యాపార సంబంధాలు బలంగా ఉన్నాయి. లండన్ పలు ఐరోపా దేశాలకూ వాణిజ్య కేంద్రంగా ఉంది. అందుకే అమెరికా బ్యాంకులు వందల ఏళ్లుగా లండన్లో బంగారాన్ని దాచే సంప్రదాయం కొనసాగిస్తున్నాయి.  ట్రంప్ ఐరోపా దేశాలపై పన్ను విధించే అవకాశం ఉన్నందున, అమెరికా బ్యాంకులు లండన్‌లోని బంగారాన్ని న్యూయార్క్‌కు తరలిస్తున్నాయి.  

Read more Photos on
click me!

Recommended Stories