తత్కాల్ టికెట్ బుకింగ్‌లో కీల‌క మార్పులు.. కొత్త రూల్ తీసుకొస్తున్న‌ ఇండియ‌న్ రైల్వే

Published : Dec 03, 2025, 01:49 PM IST

Indian Railway: త‌త్కాల్ టికెట్ విష‌యంలో కీల‌క మార్పులు చేసేందుకు భార‌తీయ రైల్వే అడుగులు వేస్తోంది. త్వ‌ర‌లోనే కొత్త రూల్‌ను తీసుకురానుంది. ఇంత‌కీ ఏంటా నియ‌మ‌మం.? ఇది ప్ర‌యాణికుల‌పై ఎలాంటి ప్ర‌భావం చూప‌నుంది.? ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
టికెటింగ్ సిస్టమ్‌లో పెద్ద మార్పు

భారత రైల్వే తక్షణ టికెట్ వ్యవస్థలో పెద్ద మార్పుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు కౌంటర్ నుంచి త‌త్క‌ల్ టికెట్ తీసుకోవడం కొంత సులభంగానే ఉండేది. కానీ త్వరలో కొత్త నియమం అమల్లోకి రానుంది. ఆ నియమం ప్రకారం ఓటీపీ చెప్పకుండా కౌంటర్ టికెట్ పొందడం దాదాపు అసాధ్యం.

25
త‌త్కాల్ టికెట్ దుర్వినియోగంపై కట్టడి

త‌త్కాల్‌ టికెట్లలో ఎక్కువ సమస్య దుర్వినియోగమే. కొంతమంది ఫేక్ నంబర్లు, మధ్యవర్తుల సహకారం, తప్పు బుకింగ్స్ వంటి అంశాలతో టికెట్లు సేకరిస్తున్నారని రైల్వేకి ఫిర్యాదులు వచ్చాయి. ఈ పరిస్థితిని అరికట్టేందుకు ఓటీపీ ఆధారిత విధానాన్ని రైల్వే ప్ర‌వేశ‌పెడుతోంది. ఈ విధానం వల్ల నిజంగా ప్రయాణించే వారికి మాత్ర‌మే టికెట్లు ల‌భిస్తాయి.

35
ఆన్‌లైన్ బుకింగ్స్‌లో ఇప్పటికే అమలులో ఉంది

ఆన్‌లైన్ టికెట్లలో ఈ విధానం ముందే ప‌రీక్షించారు. 2025 జూలైలో ఆన్‌లైన్ త‌త్క‌ల్‌ టికెట్లకు ఆధార్ ఆధారిత ధృవీకరణ ప్రారంభమైంది. తర్వాత 2025 అక్టోబర్‌లో సాధారణ రిజర్వేషన్‌కూడా ఓటీపీ అవసరం చేశారు. ఈ రెండు మార్పులకు ప్రయాణికులు త్వరగా అలవాటు పడ్డారు. రైల్వే ప్రక్రియ మరింత పారదర్శకంగా మారింది.

45
కౌంటర్ టికెట్లకు ఓటీపీ తప్పనిసరి

2025 నవంబర్ 17 నుంచి కౌంటర్ తక్షణ టికెట్లపై ఓటీపీ ధృవీకరణను రైల్వే ప్రయోగాత్మకంగా మొదలుపెట్టింది. ప్రారంభంలో కొన్ని ట్రైన్లలో అమలు చేసి, తర్వాత 52 ట్రైన్లకు విస్తరించారు. కౌంటర్లో బుకింగ్ ఫామ్‌లో ప్రయాణికుడు రాసిన మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని కౌంటర్ స్టాఫ్‌కు చెప్పిన తర్వాతే టికెట్ జారీ అవుతుంది. ఓటీపీ తప్పు అయితే టికెట్ ఇవ్వరు.

55
దేశవ్యాప్తంగా త్వరలో అమలు

త్వరలో ఈ విధానం అన్ని ట్రైన్లలో అమలుకానుంది. దీని ప్రధాన ఉద్దేశ్యం టికెటింగ్‌ను నిష్పాక్షికంగా, ప్రమాదరహితంగా ఉంచడం. ఈ నియమంతో.. మధ్యవర్తుల దందా తగ్గుతుంది, ఫేక్ ఐడీలు, తప్పు నంబర్లు ఉపయోగించే అవకాశం తగ్గుతుంది. కౌంటర్ బుకింగ్స్‌పై నమ్మకం పెరుగుతుంది. నిజమైన ప్రయాణికుడికి టికెట్ అందుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories