సబ్‌స్క్రిప్షన్ లేకుండా నెట్‌ఫ్లిక్స్ ఉచితంగా చూడొచ్చు. ఎలాగంటే

First Published | Nov 8, 2024, 10:32 PM IST

మీరు నెట్‌ఫ్లిక్స్ లో సినిమాలు, వెబ్ సిరీస్ ఉచితంగా చూడాలనుకుంటున్నారా? నెట్‌ఫ్లిక్స్ ఓ ప్రత్యేకమైన ఆఫర్ తీసుకొచ్చింది. దీన్ని ఉపయోగించడం ద్వారా మీరు స్ట్రేంజర్ థింగ్స్ వంటి షోలు, బర్డ్ బాక్స్ వంటి కొన్ని ప్రత్యేక సినిమాలు, వెబ్ సిరీస్ లను నెట్‌ఫ్లిక్స్ లో ఉచితంగా చూడొచ్చు. నెట్‌ఫ్లిక్స్ ఇచ్చిన ఈ ప్రత్యేక ఆఫర్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ఇప్పుడు థియేటర్ కి వెళ్లి సినిమా చూసే రోజులు కావు. ఏ మూవీ అయినా థియేటర్ లో రిలీజ్ అవుతున్నప్పటికీ వారానికే ఓటీటీల్లోకి అఫీషియల్ గా వచ్చేస్తున్నాయి. ఇక పైరసీ విషయం చెప్పాల్సిన పనే లేదు. అందుకే ఈ ఇబ్బందులు తట్టుకోలేక సినిమాలను పేరుకే థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ చేసే టైమ్ లోనే ఓటీటీ ప్లాట్ ఫాం నిర్వాహకులతో మాట్లాడుకొని ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసేసుకుంటున్నారు. 

దీని వల్ల సినిమా హిట్ అయినా ఫట్ అయినా కలెక్షన్లు పడిపోకుండా ఉంటాయి. నిర్మాతకు ఇబ్బంది లేకుండా పెట్టుబడి వచ్చేస్తుంది. అందువల్ల ఓటీటీల్లో ఎంత త్వరగా రిలీజ్ చేస్తే అంత ఇబ్బంది ఉండదని నిర్మాతలు, ఇటు ఓటీటీ నిర్వాహకులు కూడా అనుకుంటున్నారు.  

మరి ఏ ఓటీటీకి సినిమా ఇవ్వాలన్నది నిర్మాతల ఇష్టం. ఏ ఓటీటీ అయినా ట్రైలర్ ఫ్రీగా చూపిస్తారు. కాని నెట్‌ఫ్లిక్స్ అయితే కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. నెట్‌ఫ్లిక్స్ లో ట్రైలర్ తో పాటు వెబ్ సిరీస్ మొదటి పార్ట్ ఫ్రీగా చూడొచ్చు.  దీనికి నెట్‌ఫ్లిక్స్ సభ్యత్వం అవసరం లేదు. నెట్‌ఫ్లిక్స్ అనేక టీవీ సిరీస్‌లు, సినిమాలను ఇప్పుడు ఉచితంగా అందుబాటులో ఉంచింది. సినిమాలు, టెలివిజన్ సిరీస్‌లు అకౌంట్ అవసరం లేకుండానే చూడొచ్చు. ఏదైనా డెస్క్‌టాప్ లేదా ఆండ్రాయిడ్ బ్రౌజర్ ఉపయోగించి నెట్‌ఫ్లిక్స్ సైట్ ఓపెన్ చేసి ప్రత్యేకంగా ఎంపిక చేసిన కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ ల ఫస్ట్ పార్ట్ ఫ్రీగా చూడొచ్చు. 

Latest Videos


మీరు నెట్‌ఫ్లిక్స్‌కి వెళ్లి అవర్ ప్లానెట్, స్ట్రేంజర్ థింగ్స్, బర్డ్ బాక్స్ మరిన్నింటిని ఉచితంగా చూడవచ్చు. అంటే మీరు టీవీ ప్రోగ్రామ్‌ల మొదటి ఎపిసోడ్‌ను ఉచితంగా చూడవచ్చు. కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి నెట్‌ఫ్లిక్స్ ఇస్తున్న ప్రత్యేక ఆఫర్ ఇది. ఇది కేవలం కొన్ని సెలక్ట్ చేసిన మూవీస్, వెబ్ సిరీస్ కు మాత్రమే వర్తిస్తుంది. కానీ తదుపరి ఎపిసోడ్‌లను చూడాలంటే మీరు సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం కనీస నెలవారీ సబ్ స్క్రిప్షన్ అయిన మీరు రూ.199 పే చేయాల్సి ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే బార్డ్ ఆఫ్ బ్లడ్ మొదటి ఎపిసోడ్‌ను ఉచితంగా చూసేందుకు వీలు కల్పిస్తోంది. 

ఉచితంగా సిరీస్‌లను ఎలా చూడాలి?

గూగుల్ లో netflix.com/watch-freeని అని టైప్ చేసి లింక్ ఓపెన్ చేయండి. ఉచితంగా చూడటానికి అందుబాటులో ఉన్న అన్ని సిరీస్‌లు, చిత్రాల లిస్ట్ మీకు కనిపిస్తుంది. మీకు నచ్చిన మూవీపై క్లిక్ చేసి ఆనందంగా చూసేయండి. అయితే ముందే గుర్తుపెట్టుకోండి. మీరు కేవలం మొదటి పార్ట్ ను మాత్రమే చూడగలరు. తర్వాత పార్ట్ చూడాలంటే మీరు కచ్చితంగా సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.  

click me!