దుమ్మురేపుతున్న రిలయన్స్ జియో: ఆటో మొబైల్ రంగంలోకి తొలి అడుగు.. విడుదలకు సిద్ధంగా ఎలక్ట్రిక్ స్కూటర్

First Published | Nov 8, 2024, 5:00 PM IST

రిలయన్స్ జియో దుమ్ము రేపుతోంది. టెలికమ్యూనికేషన్ రంగంలో ఉన్న జియో ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ తయారీలోకి అడుగు పెట్టింది. త్వరలోనే ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంఛ్ చేయడానకిి సిద్ధమవుతోంది. ఆ స్కూటర్ ప్రత్యేకతలు, ధర తదితర విషయాలు తెలుసుకుందాం రండి. 

రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పెట్రోల్ బంకు నుంచి మొదలు పెట్టి దేశంలోనే నంబర్ వన్ కంపెనీగా ఎదిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అడుగు పెట్టని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. రిలయన్స్ కు దేశవ్యాప్తంగా ఎనర్జీ, పెట్రో రసాయననాలు, క్లాత్స్, సహజ వనరులు, రీటెయిల్, టెలికమ్యూనికేషన్స్ విభాగాల్లో పనిచేసే అనేక సంస్థలు ఉన్నాయి. ఇది భారతదేశంలో అత్యంత లాభదాయకమైన కంపెనీ.మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం బహిరంగ మార్కెట్లో ట్రేడ్ అవుతున్న అతి పెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీ. ఇటీవలే భారత ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ను అధిగమించి అత్యంత ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించే సంస్థగా నిలిచింది.

రిలయన్స్ జియో టెలీకమ్యూనికేషన్ రంగంలో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఇటీవలే టారిఫ్ ధరలు పెంచినప్పటికీ బీఎస్ఎన్ఎల్ దెబ్బకు మళ్లీ పండగ ఆఫర్లు అంటూ ధరలు తగ్గించి వినియోగదారులను ఆకట్టుకుంటోంది. దేశం మొత్తం మీద ఎక్కువ మంది వాడే నెట్ వర్క్ ఏదైనా ఉందంటే జియోనే. తర్వాత స్థానాల్లో ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్-ఐడియా ఉన్నాయి. ముఖ్యంగా తక్కువ రీఛార్జ్ ధరలు అందిస్తూ రిలయన్స్ జియో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. మంత్లీ, క్వార్టర్లీ, ఇయర్లీ ఇలా ఏ ప్లాన్ అయినా పోటీ కంపెనీల కంటే తక్కువకే రీఛార్జ్ చేసుకొనే వెసులుబాటు జియోలో మాత్రమే ఉంది. 


రిలయన్స్ ఫోన్లు కూడా మార్కెట్ లో దుమ్మురేపుతున్నాయి. అత్యంత తక్కువ ధరకు అదిరిపోయే ఫీచర్స్ అందించడంలో జియో తరువాతే ఏ కంపెనీ అయినా అని చెప్పొచ్చు. ఇటీవలే 5జీ టెక్నాలజీతో ప్రపంచంలోనే  అత్యంత తక్కువ ధరకు 5జీ స్మార్ట్ ఫోన్ తయారు చేసి పోటీ కంపెనీలకు షాక్ ఇచ్చింది. భారీ కాన్ఫిగరేషన్ కలిగిన మరో టచ్ ఫోన్ కూడా ఇటీవలే తయారు చేసింది. ఇంతకు ముందు 999 రూపాయలకే 4జీ టెక్నాలజీతో కీప్యాడ్ ఫోన్ విడుదల చేసి పేదలకు చేరువైంది. భారతదేశంలో మొత్తం 25 కోట్ల మంది ఈ ఫోన్ ఉపయోగిస్తున్నారు. ఇది ఒక రికార్డుగా నిలిచిపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవలే 50 ఏళ్లు పూర్తి చేసుకొని సంబరాలు చేసుకుంది.  

అలాంటి దిగ్గజ కంపెనీ ఎలక్ట్రిక్ మోటార్ రంగంలోకి అడుగు పెట్టిందంటే పోటీ కంపెనీలు కచ్చితంగా భయపడతాయి. ఇప్పటికే మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ రంగంలో ఓలా అగ్రగామిగా కొనసాగుతోంది. తరువాత స్థానాల్లో ఏథర్, టీవీఎస్, ఓకినావా, బజాజ్, హోండా వంటి కంపెనీలు తమ ప్రోడక్ట్స్ అందిస్తున్నాయి. వాటికి పోటీగా రిలయన్స్ జియో తనదైన శైలిలో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తోంది. ఇది ఒకసారి రీఛార్జ్ చేస్తే 110 కి.మీ వరకు ప్రయాణించొచ్చు. 

జియో ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేకతలివే..

క్లౌడ్ కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, USB ఛార్జింగ్ పోర్ట్, LED డిస్‌ప్లే, బ్లూటూత్ వంటి అధునాతన ఫీచర్లు ఈ స్కూటర్‌లో ఉన్నాయి.

జియో ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 110 కి.మీ వరకు ప్రయాణించగలదు. ఇది గంటకు అత్యధికంగా 80 కి.మీ. వేగంతో దూసుకుపోతుంది. జియో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర సుమారుగా రూ.80 వేలు ఉంటుందని అంచనా. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఆటోమొబైల్ రంగంలోని వచ్చిన రిలయన్స్ జియో పోటీ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుందనడంలో సందేహం లేదు. 

Latest Videos

click me!