Gold Rate Today: గోల్డ్, సిల్వర్ ధరలకు బ్రేక్.. వరుసగా మూడో రోజు పతనం

Published : Mar 05, 2026, 10:15 AM IST

Gold Rate Today: ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య వార్..గోల్డ్, వెండి మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. అందుకే గతవారం అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. కానీ రెండు, మూడ్రోజులుగా మళ్లీ పతనం దిశగా సాగుతున్నాయి. 

PREV
14
దేశీయంగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు

యుద్ధ పరిస్థితులు నెలకొన్నప్పుడు సాధారణంగా పెట్టుబడిదారులు భద్రత కోసం బంగారం, వెండి వంటి విలువైన లోహాల వైపు మొగ్గు చూపుతారు. గ్లోబల్ మార్కెట్లో ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. అయితే ఈసారి ఆ పెరుగుదల ఎక్కువకాలం కొనసాగలేదు. కేవలం రెండు మూడు రోజులే పెరిగిన తర్వాత ఇప్పుడు మళ్లీ ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశీయ మార్కెట్లో వరుసగా మూడో రోజు కూడా బంగారం, వెండి రేట్లు పడిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గడం కొనుగోలుదారులకు కొంత ఊరటను కలిగిస్తోంది. 

24
మూడు రోజుల్లోనే బంగారం ధరల్లో భారీ మార్పు

ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,50,800 వద్ద కొనసాగుతోంది. ఒక్కరోజులోనే రూ. 2,850 తగ్గింది. అంతకుముందు మార్చి 2, 3 తేదీల్లో కూడా వరుసగా రూ. 2,350, రూ. 2,650 మేర ధర తగ్గింది. అంటే కేవలం మూడు రోజుల వ్యవధిలోనే బంగారం ధరల్లో భారీ మార్పు కనిపించింది.

34
రూ. 8 వేలకుపైగా పతనం

ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం తులం బంగారం ధర హైదరాబాద్‌లో రూ. 1,64,510 వద్ద ఉంది. ఒక్కరోజులోనే రూ. 3,110 తగ్గింది. మొత్తం మూడు రోజులలో కలిపి చూస్తే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 8 వేలకుపైగా తగ్గడం విశేషంగా చెప్పుకోవాలి.

44
ఈ తగ్గుదల దేనికి సంకేతం?

బంగారం ధరల దారిలోనే వెండి ధరలు కూడా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి ధర ప్రస్తుతం రూ. 2.95 లక్షలు. ఒక్కరోజులోనే దాదాపు రూ. 20 వేల మేర పతనమైంది. మార్చి 2న కూడా వెండి ధర రూ. 10 వేల మేర తగ్గింది. అయితే దానికి ముందు ఐదు రోజుల్లో వెండి ధర దాదాపు రూ. 35 వేల వరకు పెరిగిన సంగతి తెలిసిందే.

మరోవైపు భారత రూపాయి విలువ కూడా ఒత్తిడిలోనే ఉంది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹92.07 వద్ద ఉంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, యుద్ధ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్ మార్పులు వచ్చే రోజుల్లో బంగారం, వెండి ధరలపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories