2027లో ఈ రోబోలు అమ్మకానికి వస్తాయని ప్రకటించారు. అయితే భద్రత విషయంలో కూడా మస్క్ హామీ ఇస్తున్నారు. అవి అత్యంత భద్రత, విశ్వసనీయతతో ఉంటాయని చెబుతున్నారు. రోబోలు మనుషులకు ఎలాంటి హాని కలిగించకుండా టెస్లా చాలా శ్రద్ధ తీసుకుంటోందని వివరించారు. మొదట్లో దీని ధర ఎక్కువగా ఉంటుందని.. తరవుాత స్మార్ట్‌ఫోన్‌ల లాగే ఇది కూడా చౌక ధరకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
భవిష్యత్తులో భూమిపై మనుషుల కంటే రోబోల సంఖ్యే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఎలాన్ మస్క్ అంచనా వేశారు. భవిష్యత్తులో మనుషుల అన్ని అవసరాలను రోబోలే తీర్చే పరిస్థితి వచ్చినా వస్తుంది.. అప్పుడు మనుషుల కంటే రోబోలే ఎక్కువగా పనిచేస్తాయి అని ఆయన చెప్పారు.