విజయ్ మాల్యాకి మరో బిగ్ షాక్.. ఎట్టకేలకు కింగ్ ఫిషర్ హౌస్ కూడా విక్రయం..

First Published Aug 14, 2021, 5:04 PM IST

పరారీలో ఉంటూ విదేశాలలో తలదాచుకుంటున్న ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకి చెందిన కింగ్ ఫిషర్ హౌస్ నేడు  విక్రయించారు. కింగ్ ఫిషర్ హౌస్ దివాలా తీసిన  కంపెనీ కింగ్ ఫిషర్ కి ప్రధాన కార్యాలయం. ఎన్నో ప్రయత్నాల తర్వాత డెబ్ట్ రికవరీ ట్రిబ్యునల్ (DRT) కింగ్‌ఫిషర్ హౌస్‌ను విక్రయించింది.

 దీనిని హైదరాబాద్ కు చెందిన ప్రైవేట్ డెవలపర్స్ సాటర్న్ రియల్టర్స్ రూ .52 కోట్లకు కొనుగోలు చేసింది. దీని అమ్మకపు ధర  రిజర్వ్ ధర రూ .135 కోట్లలో మూడవ వంతు.  కింగ్ ఫిషర్ హౌస్ వైశాల్యం 1,586 చదరపు మీటర్లు. ఈ  భవనంలో బేస్‌మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్, సెకండ్  ఫ్లోర్ ఉంటాయి.

కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియంకు దాదాపు రూ .10,000 కోట్లు బకాయిపడింది. ఇంతకుముందు బ్యాంకులు కంపెనీ వాటాల వేలం ద్వారా రూ .7,250 కోట్లను రికవరీ చేసినట్లు సమాచారం.


ఈ ఆస్తిని విక్రయించడానికి గతలోనే వేలం జరిగింది అయితే ఈ వేలం ఎనిమిది సార్లు విఫలమైంది. మొదటిసారిగా 2016 మార్చిలో వేలం వేశారు. అప్పుడు ఈ  ఆస్తి విలువ రూ .150 కోట్లుగా  రిజర్వ్‌లో ఉంచింది. కింగ్ ఫిషర్ హౌస్ డీల్ అధిక రిజర్వ్ ధర కారణంగా జరగలేదు.

బ్రిటిష్ కోర్టు

యూ‌కే కోర్టు 26 జూలైలో విజయ్ మాల్యాను దివాలా తీసినట్లు ప్రకటించిన ఉత్తర్వును ఆమోదించింది. దీనితో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బి‌ఐ) నేతృత్వంలోని ఇతర భారతీయ బ్యాంకులు ఇప్పుడు మాల్యా ఆస్తులను సులభంగా స్వాధీనం చేసుకోగలవు. దీనికి సంబంధించి ఈ బ్యాంకులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. నిలిచిపోయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ద్వారా బకాయి ఉన్న రుణాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రపంచవ్యాప్త ఫ్రీజింగ్ ఆర్డర్‌ని  విజయ్ మాల్యా పాటించాలని తెలిపాయి.

 విజయ్ మాల్యా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం ఎస్‌బి‌ఐ సహా ఇతర బ్యాంకుల నుండి సుమారు రూ .9,990 కొట్ల రుణం తీసుకున్నాడు. కానీ కంపెనీ పరిస్థితి కారణంగా విజయ్ మాల్యా బ్యాంకులకు  రుణాలు తిరిగి చెల్లించలేకపోయాడు. దీని తరువాత కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 2012 సంవత్సరంలో మూసివేయబడింది.
 

click me!