పెరిగిన బంగారం ధరలు, తగ్గిన వెండి.. త్వరలోనే రూ.50 వేలకి పసిడి..

First Published Aug 14, 2021, 12:00 PM IST

భారతదేశంలో బంగారం ధరలు ఈ వారం ప్రారంభంలో గత ఐదు నెలల కనిష్టానికి చేరుకున్నాయి. పసిడి ధర దాదాపు రూ. 46,000-46,500-శ్రేణికి చేరుకుంది, మొత్తం మీద గత ఏడాది  గరిష్ట స్థాయి నుండి దాదాపు రూ. 10,000 తగ్గిపోయింది.   

విశ్లేషకుల ప్రకారం మెరుగైన యూ‌ఎస్ ఉపాధి డేటా, బలమైన యూ‌ఎస్ డాలర్ కారణంగా పసిడి ధరల్లో క్షీణత సంభవించింది. ఈ నెలలో ఇప్పటివరకు స్పాట్ బంగారం ధరలు దాదాపు రూ .2,100 తగ్గింది. 

సురక్షితమైన ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయమా? విశ్లేషకులు ఏం సూచిస్తున్నారో తెలుసుకోండి

"కోవిడ్ -19 డెల్టా వేరియంట్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షితమైన స్వర్గధామానికి తరలివెళుతున్నందున యుఎస్ డాలర్ స్వల్పకాలంలో స్థిరంగా కొనసాగవచ్చు. కాబట్టి  కొంతకాలం పాటు మరిన్ని దిద్దుబాట్లు చూడవచ్చు "అని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ శ్రీరామ్ అయ్యర్ అభిప్రాయపడ్డారు.

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) నివేదిక ప్రకారం ఈ సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశంలో బంగారం డిమాండ్ 19.2 శాతం పెరిగి 76.1 టన్నులకు పెరిగింది. విలువ పరంగా భారతదేశంలో బంగారం డిమాండ్ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 23 శాతం వృద్ధిని సాధించి రూ.32,810 కోట్లకు చేరుకుంది. విలువ పరంగా బంగారం పెట్టుబడి డిమాండ్ 10 శాతం పెరిగి రూ .9,060 కోట్లకు చేరింది. రాబోయే పండగ సీజన్‌లో బంగారం డిమాండ్ పెరుగుతుందని విశ్లేషకులు విశ్వసిస్తున్నారు

 గత నెలగా ఇప్పటివరకు బంగారం ధరలు దాదాపు రూ .2,100 తగ్గాయి. 2021 క్యాలెండర్ సంవత్సరం ప్రథమార్థంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ఫారెక్స్ నిల్వలలో భాగంగా రికార్డు స్థాయిలో 29 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది.  ఇటీవల మీడియా నివేదికలు కూడా ఆర్‌బిఐ బంగారం నిల్వను 700 టన్నులకు పైగా సూచించింది, గత రెండేళ్లలో 27% పెరిగింది అని ఎం‌ఎం‌టి‌సి-పి‌ఏ‌ఎం‌పి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వికాస్ సింగ్ అన్నారు.

బంగారం ధరలు నిన్న(13-08-2021) రూ.43,600గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈరోజు రూ 43,700గా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,560గా ఉండగా నేడు రూ47,680గా ఉంది.

దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,950గా ఉంది.
 దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,860గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,860గా ఉంది. 
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,020గా ఉంది. 
కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,700గా ఉంది.
 బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,700గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ47,680గా ఉంది. 
హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ 43,700 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,680 గా ఉంది. 
 

వెండి ధరల విషయానికి వస్తే వెండి ధరలు కూడా కాస్త తగ్గాయి. నిన్న(13-08-2021 శుక్రవారం)తో ధరలతో పోలిస్తే కేజీ వెండి ధర రూ. 20 తగ్గింది. ఈ రోజు(14-08-2021 శనివారం) కేజీ వెండి ధర రూ 67,500గా ఉంది. 

ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, కొలకత్తా లలో కేజీ వెండి ధర రూ 62,500గా ఉండగా, హైదరాబాద్, చెన్నైలలో 67,300గా ఉంది. పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (14-08-2021 శనివారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.
 

click me!