ఆగష్టు హాలిడే లిస్ట్ : ఈ నగరాల్లో వచ్చే 10 రోజుల్లో 8 రోజులు బ్యాంకులకు సెలవు..

First Published Aug 14, 2021, 12:48 PM IST

 రిజర్వ్ బ్యాంక్  ఆఫ్ ఇండియా ఆగస్టు నెల హాలిడేస్ లిస్ట్ విడుదల చేసింది. ఆర్‌బి‌ఐ ప్రకారం మొత్తం 8 సెలవులు బ్యాంకులకు రానున్నాయి. వీటితో పాటు వీకెండ్ హాలిడేస్ కూడా ఉన్నాయి, అంటే ఆదివారాలు అలాగే రెండవ ఇంకా నాల్గవ శనివారాలు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెలలో  బ్యాంకుల సెలవుల జాబితా మొత్తం 15 రోజులకు పెరిగింది. 

 ఆగస్టు మొదటి వారం గడిచిన తరువాత ఈ జాబితా వీకెండ్ హాలిడేస్ తో సహా 12 సెలవులకు కుదించింది. అపెక్స్ బ్యాంక్ జాబితా చేసిన సెలవులు రాష్ట్రాల వారీగా సెలవులు, మతపరమైన లేదా పండుగలు ఉన్నాయి.

ఈ సెలవులు భారతదేశమంతటా ఒకే విధంగా లేవు. బ్యాంక్ కస్టమర్‌లు  ఈ నెలలో చేయాల్సిన  బ్యాంకు పనులను ముందుగా ప్లాన్ చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఆర్‌బిఐ ఈ సెలవులను మూడు విస్తృత బ్రాకెట్లలో జారీ చేసింది-'నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్  హాలిడేస్', 'నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ హాలిడే అండ్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే' లేదా 'బ్యాంక్' అకౌంట్స్ క్లోజింగ్ '.
 

ఆగస్టు నెలలో సెలవులు 'నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ సెక్షన్' కిందకు వస్తాయి. ఆర్‌బిఐ జాబితా ప్రకారం బ్యాంక్ సెలవుల అధికారిక జాబితా రేపటి నుండి ప్రారంభమైనప్పటికీ కొన్ని సెలవులు ఆదివారాలు కలుపుకొని ఉన్నాయి. ఆగస్టు నెల ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటికీ రెండు ఆదివారాలు వచ్చాయి.  

ఈ జాబితాలో మొదటి సెలవు  ఆగస్టు 13 దేశభక్తుల దినోత్సవం.  ఇది ఇంఫాల్‌లో బ్యాంకులకు  మాత్రమే సెలవుదినం. అదేవిధంగా ఈ సెలవుల్లో ఎక్కువ భాగం రాష్ట్రాల వారీగా లేదా ప్రాంతాల వారీగా మారుతూ ఉంటాయి. ఆదివారాలు అలాగే రెండవ/నాల్గవ శనివారాలు కాకుండా రాష్ట్రాలు లేదా నగరాలలో ఎక్కువ భాగం జరుపుకునే రెండు ఇతర సెలవులు  కూడా ఉన్నాయి.
 

అలాంటి సెలవులలో ఒకటి ఆగస్టు 19 - ముహర్రం (అశూర). ఈ హాలిడే అగర్తలా, అహ్మదాబాద్, బేలాపూర్, భోపాల్, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగపూర్, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, శ్రీనగర్‌లో బ్యాంకులకు సెలవు.

అలాగే మరో సెలవుదినం జన్మాష్టమి (శ్రావణ్ వడ్ -8)/కృష్ణ జయంతి ఆగష్టు 30న వస్తుంది. ఈ సెలవు అహ్మదాబాద్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, లక్నో, పాట్నా, రాయపూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్, గాంగ్‌టక్ బ్యాంకులకు ఉంటుంది.  
 

ఆర్‌బిఐ  ప్రకారం ఆగస్టు 2021 సెలవుల జాబితా : (ఆగస్టు 14 నుండి లెక్కింపు)

1) 14 ఆగస్టు 2021 - రెండవ శనివారం

2) 15 ఆగస్టు 2021 - ఆదివారం

3) 16 ఆగస్టు 2021 - పార్స్ న్యూ ఇయర్ (షహెన్‌షాహి) / (బేలాపూర్, ముంబై, నాగపూర్)

4) 19 ఆగస్టు 2021 - ముహర్రం (అశూర) / (అగర్తలా, అహ్మదాబాద్, బేలాపూర్, భోపాల్, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగపూర్, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, శ్రీనగర్)

5) 20 ఆగస్టు 2021 - ముహర్రం/మొదటి ఓనం (బెంగళూరు, చెన్నై, కొచ్చి, తిరువనంతపురం)

6) 21 ఆగస్టు 2021 - తిరువోనం (తిరువనంతపురం, కొచ్చి)

7) 22 ఆగస్టు 2021 - ఆదివారం

8) 23 ఆగస్టు 2021 - శ్రీ నారాయణ గురు జయంతి (తిరువనంతపురం, కొచ్చి)

9) 28 ఆగస్టు 2021 - నాల్గవ శనివారం

10) 29 ఆగస్టు 2021 - ఆదివారం

11) 30  ఆగస్టు 2021 - జన్మాష్టమి (శ్రావణ్ వడ్ -8)/కృష్ణ జయంతి (అహ్మదాబాద్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, లక్నో, పాట్నా, రాయపూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్, గాంగ్‌టక్)

12) 31 ఆగస్టు 2021 - శ్రీ కృష్ణ అష్టమి (హైదరాబాద్)

click me!