అబ్బా.. 25 కోట్ల కాన్వాయిలో అనంత్ అంబానీ ఎం కొనడానికి వచ్చాడో తెలుసా..?

First Published | Apr 8, 2024, 5:10 PM IST

ఆసియ అత్యంత  సంపన్నుడు, బిలియనీర్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ  లగ్జరీ  లైఫ్ స్టయిల్ ఎప్పుడు చర్చనీయాంశంగా నిలుస్తుంది. అతని దగ్గర లగ్జరీ కార్లు, వాచెస్  భారీ కలెక్షన్ కూడా ఉంది. ఈ బిలియనీర్ అనంత్ అంబానీ తాజాగా   మరోసారి ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లో నిలిచారు. 
 

అనంత్ అంబానీ భారతదేశంలోని అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీకి చిన్న కుమారుడు. ప్రస్తుతం అతని నెట్  విలువ  రూ.9,71,685 కోట్లు. ఇటీవలే గుజరాత్‌లోని జామ్నా నగర్లో  అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది.
 

దుబాయ్‌లోని రిమోవా స్టోర్ నుండి అనంత్ అంబానీ సామాను కొనుగోలు చేసిన వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి, అయితే ఆశ్చర్యకరంగా ఈసారి లగ్జరీ సూట్‌కేస్ లేదా డ్రెస్ లేదా వాచెస్ దృష్టిని ఆకర్షించలేదు. కానీ అనంత్ అంబానీ కాన్వాయ్‌లోని దాదాపు రూ.25 కోట్ల కారులో షాపింగ్  చేసేందుకు వెళ్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. 
 


అనంత్ అంబానీ స్వయంగా రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ SUVలో ప్రయాణించాడు, దీని ధర భారతదేశంలో రూ. 10 కోట్లుగా ఉంది. రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ SUV భారతదేశంలో విక్రయించబడే అత్యంత ఖరీదైన SUV.  

ఈ భారీ SUVలు కాకుండా, అతని కాన్వాయ్‌లో భాగంగా అంబులెన్స్ కూడా కనిపించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆటోమొబిలియార్డెంట్ షేర్  చేసిన వీడియోలో అనంత్ అంబానీ   భారీ కాన్వాయ్‌ను చూడవచ్చు.
 

భారతదేశంలోని అత్యంత సంపన్న కుటుంబమైనప్పటికీ  అనంత్ అంబానీ బ్రౌన్ యూనివర్సిటీలో చదువు పూర్తి చేశారు. ఇప్పుడు రిలయన్స్ న్యూ ఎనర్జీ బిజినెస్‌ని నిర్వహిస్తున్నారు. 

అనంత్ అంబానీ అంబానీ గ్రూప్‌లోని రిలయన్స్ 02C అండ్  రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీకి డైరెక్టర్. నివేదికల ప్రకారం, అనంత్ అంబానీ నికర విలువ 40 బిలియన్ డాలర్లు.

Latest Videos

click me!