ఆర్బీఐ నేడు 90వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఆర్‌బీఐ 90వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ 90 రూపాయాల స్మారక నాణేన్ని విడుదల చేశారు. అయితే దేశంలోనే తొలిసారిగా 90 రూపాయల నాణెం విడుదలైంది.
అలాగే, కాయిన్ పైన మూడు సింహల కుడి వైపున హిందీలో, ఎడమ వైపున ఆంగ్లంలో వ్రాసి ఉంటుంది. దీనికి మరోవైపు RBI లోగో అలాగే RBI కింద అంచున హిందీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన అంచున ఇంగ్లిష్ లో Reserve Bank of India అని ఉంటుంది.
స్వచ్ఛమైన వెండితో తయారు చేసిన ఈ నాణెం ప్రత్యేకత. అంతే కాకుండా ఇందులో 40 గ్రాముల వెండిని కూడా వాడారు. రూ.90 వెండి నాణెంపై ఒకవైపు బ్యాంకు చిహ్నం, మరోవైపు రూ.90 అని ఉంటుంది.
అంతకుముందు, 1985లో ఆర్‌బీఐ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా అలాగే 2010లో ఆర్‌బీఐ ప్లాటినం జూబ్లీ సందర్భంగా స్మారక నాణేలను విడుదల చేశారు. నివేదికల ప్రకారం, ఈ నాణెం అంచనా ధర దాదాపు రూ.5200 నుండి రూ.5500 వరకు ఉండవచ్చు.
భారత ప్రభుత్వం ముద్రించిన ఈ రూ.90 నాణెం 40 గ్రాముల బరువుతో 99.9 శాతం స్వచ్ఛమైన వెండితో తయారు చేయబడింది.