టీ20 క్రికెట్ లీగ్ మ్యాచ్‌లను నిరాటంకంగా వీక్షించాలనుకునే అభిమానుల కోసం వోడాఫోన్ ఐడియా (Vi) కొత్త ప్రీపెయిడ్ ప్యాక్‌లను ప్రవేశపెట్టింది. ఈ ప్యాక్‌లు కేవలం రూ. 101 నుంచి ప్రారంభమవుతాయి. వీటిని మీరు రీఛార్జ్ చేసుకుంటే హై స్పీడ్ డేటాతో పాటు జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు. టీ20 క్రికెట్ లీగ్ సీజన్ కోసం వోడాఫోన్ ఐడియా ఈ ప్రత్యేక ప్యాక్ లను అందిస్తోంది. ఆ ప్యాక్ ల వివరాలు తెలుసుకుందాం రండి.
కొత్త ప్యాక్‌ల వివరాలు
టీ20 క్రికెట్ లీగ్ మ్యాచ్‌లను వీక్షించాలనుకునే అభిమానుల కోసం వోడాఫోన్ ఐడియా మూడు ప్రత్యేకమైన ప్యాక్ లను తీసుకొచ్చింది.
మొదటిది రూ. 101 ప్యాక్. ఇది రీఛార్జ్ చేసుకుంటే 5 జీబీ డేటాతో పాటు జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా లభిస్తుంది. ఈ ప్యాక్ వ్యాలిడిటీ వచ్చేసి 30 రోజులు కాగా జియో హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ మాత్రం 90 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అంటే జియో హాట్ స్టార్ కావాలంటే కొత్త డేటా ప్యాక్ వేయించుకోవాలన్న మాట.
రెండోది రూ. 239 ప్యాక్. ఈ ప్యాక్ ద్వారా 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. దీంతో పాటు 2 జీబీ డేటా ఫ్రీగా ఇస్తారు. ఇవి కాకుండా జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.
చివరిగా రూ. 399 ప్యాక్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాల్స్ + రాత్రి 12 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్‌లిమిటెడ్ డేటా మీరు వాడుకోవచ్చు. అంతేకాకుండా 2 జీబీ డైలీ డేటా కూడా లభిస్తుంది. దీంతో పాటు జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ.
వొడాఫోన్ ఐడియాలో ఇతర ప్యాక్‌ల వివరాలు
ఎక్కువ డేటా కావాలనుకొనే వారికి రూ. 469 ప్యాక్ బాగుంటుంది. దీని ద్వారా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రాత్రి 12 నుంచి మధ్యాహ్నం 12 వరకు అన్‌లిమిటెడ్ డేటా ఉపయోగించుకోవచ్చ. ఇవి కాకుండా రోజుకు 2.5 జీబీ లభిస్తుంది. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 28 రోజులు. కాని 3 నెలల వరకు జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.
రూ. 994 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే అన్‌లిమిటెడ్ కాల్స్ + రాత్రి 12 నుంచి మధ్యాహ్నం 12 వరకు అన్‌లిమిటెడ్ డేటాతో పాటు రోజుకు 2 జీబీ డేటా ఎక్స్ ట్రా లభిస్తుంది. దీంతో పాటు 3 నెలల జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. ఈ ప్యాక్ వ్యాలిడిటీ వచ్చేసి 84 రోజులు.
రూ. 3699 ప్లాన్ ద్వారా మీరు అన్‌లిమిటెడ్ కాల్స్ తో పాటు రాత్రి 12 నుంచి మధ్యాహ్నం 12 వరకు అన్‌లిమిటెడ్ డేటా లభిస్తుంది. ఇది కాకుండా రోజుకు 2 జీబీ డేటా కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఏడాది పాటు జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. అయితే ఈ రీఛార్జ్ ప్యాక్ వ్యాలిడిటీ 365 రోజులు.
ఇక్కడ తెలిపిన ప్యాక్‌లన్నీ జియోహాట్‌స్టార్ మొబైల్-ఓన్లీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తాయి. అన్ని ప్లాన్‌లలో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా ఉన్నాయి. మీరు గాని ఈ రీఛార్జ్ ప్యాక్ లు పొందాలనుకుంటే Vi యాప్ లేదా www.MyVi.in వెబ్‌సైట్ ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చు. క్రికెట్ ప్రేమికులకు ఈ ప్యాక్‌లు చాలా బాగా నచ్చుతాయి.