అమెజాన్‌కు భారీ విజయం.. ఫ్యూచర్ రిటైల్‌తో రిలయన్స్ ఒప్పందాన్ని సుప్రీం కోర్టు నిలిపివేత..

First Published Aug 6, 2021, 5:26 PM IST

 అమెజాన్-ఫ్యూచర్ రిటైల్-రిలయన్స్ కేసులో సుప్రీంకోర్టు  తీర్పును నేడు వెల్లడించింది. ఈ కేసులో రిలయన్స్ అండ్ ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (FRL)కి ఎదురుదెబ్బ తగిలింది. రూ .24,713 కోట్ల విలువైన రిలయన్స్ అండ్ ఫ్యూచర్ రిటైల్ డీల్ విషయంలో అమెరికన్ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ భారీ విజయాన్ని సాధించింది. 

 సింగపూర్ ఎమర్జెన్సీ ఆర్బిట్రేటర్ నిర్ణయం భారతదేశంలో అమలు చేయదగినదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఇది భారతీయ చట్టాల ప్రకారం చట్టబద్ధమైనది అని సూచించింది.  రిలయన్స్-ఫ్యూచర్ రిటైల్ ఒప్పందానికి వ్యతిరేకంగా అమెజాన్ చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.  
 

అమెజాన్ గత సంవత్సరం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు రూ.24,731 కోట్ల ఫ్యూచర్ రిటైల్ ఆస్తులను విక్రయించడానికి అంగీకరించడం ద్వారా ఒప్పందాలను ఉల్లంఘించిందని అమెజాన్ భాగస్వామి ఫ్యూచర్ గ్రూప్‌ని కోర్టుకు లాగింది.
 

అక్టోబర్ 2020లో సింగపూర్ ఎమర్జెన్సీ ఆర్బిట్రేటర్ ఫ్యూచర్ రిటైల్ రిలయన్స్ రిటైల్‌తో విలీనంతో ముందుకు సాగకుండా నిరోధించింది.   సింగపూర్ ఎమర్జెన్సీ ట్రిబ్యునల్ నిర్ణయం భారతీయ చట్టం ప్రకారం చెల్లుబాటు అవుతుందో లేదో అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించాల్సి ఉంది. వివిధ కోర్టులలో రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్ మధ్య ఒప్పందాన్ని అమెజాన్ వ్యతిరేకించింది. జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ బెంచ్ జూలై 29న  వాదనలు విన్న తర్వాత ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్, రిలయన్స్ రిటైల్ కేసులో తీర్పును రిజర్వ్ చేసింది. ఫ్యూచర్ కూపన్స్ లిమిటెడ్‌లో అమెజాన్ 49 శాతం వాటాను, ఫ్యూచర్ రిటైల్‌లో 9.82 శాతం వాటాను కలిగి ఉంది.
 

రిలయన్స్ స్టాక్ బూమ్

ఈ వార్త తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్  స్టాక్స్‌  భారీగా క్షీణించాయి. ఉదయం 11.35 గంటలకు 43.95 పాయింట్లు (2.06 శాతం) తగ్గి 2089.35 స్థాయిలో ట్రేడవుతోంది. ప్రారంభ ట్రేడ్‌లో  2125.20 స్థాయిలో ప్రారంభమైంది. గత సెషన్‌లో స్టాక్స్‌   2133.30 వద్ద ముగిసింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13,24,531.55 కోట్లు.
 

click me!