ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22లో దేశ రియల్ జిడిపిలో 9.5 శాతం వృద్ధి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ జిడిపి 17.2 శాతంగా ఉంటుందని శక్తికాంత దాస్ అన్నారు.
ద్రవ్యోల్బణంపై శక్తికాంత దాస్ 2021-2022 ఆర్థిక సంవత్సరంలో సిపిఐ 5.7 శాతంగా ఉండవచ్చని, గత సమావేశంలో దీనిని 5.1 శాతంగా అంచనా వేశారు.
రెండవ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 5.9 శాతం, మూడో త్రైమాసికంలో 5.3, నాల్గవ త్రైమాసికంలో 5.8 శాతం ఉండవచ్చు తెలిపారు.
అలాగే 2022-2023 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సిపిఐ 5.1 శాతంగా ఉండవచ్చని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.