అమెజాన్‌ మరో కీలక నిర్ణయం.. జనవరి 2022 వరకు ఉద్యోగులు ఇంటి వద్దనే..

Ashok Kumar   | Asianet News
Published : Aug 06, 2021, 03:40 PM IST

 శాన్ ఫ్రాన్సిస్కో: యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో  కరోనా వైరస్ కేసులు ముఖ్యంగా డెల్టా వేరియంట్ కేసుల వ్యాప్తి కారణంగా ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ శుక్రవారం  కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు వచ్చే ఏడాది అంటే జనవరి 2022 వరకు ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహించాలని ఆఫీస్ టైమ్‌లైన్‌ను ప్రకటించింది.

PREV
14
అమెజాన్‌ మరో కీలక నిర్ణయం.. జనవరి 2022 వరకు ఉద్యోగులు  ఇంటి వద్దనే..

ఇంతకుముందు అమెజాన్ సెప్టెంబర్ 2021లో ఆఫీస్ కార్యాలయాలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది.  

"మేము కోవిడ్-19కి సంబంధించిన స్థానిక పరిస్థితులను పరిశీలిస్తున్నాం. అయితే సెప్టెంబర్ 7 నుండి ఉద్యోగులు  ఆఫీసులకు రావడం ప్రారంభిస్తారని మేము ఇంతకుముందు ఊహించాం.  కానీ తాజా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అమెరికాతో పాటు ఇతర దేశాలలో కార్పొరేట్ ఉద్యోగుల కోసం మా మార్గదర్శకాలను సర్దుబాటు చేస్తున్నాము. 3 జనవరి 2022 వరకు వర్క్‌ ఫ్రం హోం విధులు కొనసాగించాలని ఉద్యోగులకు స్పష్టం చేసినట్లు ”అమెజాన్ తెలిపింది.
 

24

"మా రిటర్న్-టు-ఆఫీస్ టైమ్‌లైన్ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా మారుతుంది" అని కంపెనీ తెలిపింది. 

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సి‌డి‌సి) ప్రకారం యూ‌ఎస్ లోని ఆసుపత్రిలో ఉన్న రోగుల సంఖ్య గత నెలలో సగటున దాదాపు 12,000 నుండి దాదాపు 43,000 వరకు అంటే మూడు రెట్లు పెరిగింది. డెల్టా వేరియంట్ వల్ల సగటున రోజుకు 94,000 వరకు కేసులను  నమోదవుతున్నాయి.
 

34

గత నెలలో అమెజాన్ వేర్ హౌస్  కోసం  ఆన్-సైట్ టెస్టింగ్ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అయితే అధికారిక ఆరోగ్య మార్గదర్శకాలు మారినట్లయితే టెస్టింగ్ తిరిగి ప్రారంభమవుతాయి.

యుఎస్‌లో కోవిడ్ కేసులు పెరుగుతున్నందున మైక్రోసాఫ్ట్   కూడా అఫిల్ కార్యాలయ పున ప్రారంభ తేదీని  వాయిదా వేసింది.

44

వచ్చే నెల నుండి యుఎస్‌లోని ఏదైనా ఆఫీస్ భవనంలోకి ప్రవేశించే ముందు వాక్సిన్ ధృవీకరణ పత్రాన్ని చూపించాల్సి ఉంటుందని కంపెనీ ఉద్యోగులకు,  వెండర్స్ కి తెలిపింది.

ఫేస్‌బుక్  కూడా గత వారం యుఎస్ ఉద్యోగులు ఆఫీస్ తిరిగి వచ్చినప్పుడు తప్పనిసరిగా కోవిడ్ -19 టీకాలు వేయించాల్సిది అని  పేర్కొంది. ట్విట్టర్ కూడా యుఎస్‌లో కార్యాలయాలను మూసివేసిన సంగతి మీకు తెలిసిందే.
 

click me!

Recommended Stories