దీపావళికి ముందే మోడీ ప్రభుత్వం ప్రజల కోసం బహుమతులను ప్రకటిస్తోంది. ఇప్పటికే జీఎస్టీ స్లాబులను తగ్గించి మధ్యతరగతి, పేద ప్రజలకు పెద్ద కానుకనే ఇచ్చింది. అలాగే త్వరలోనే స్లీపర్ వందే భారత రైలు రాబోతోంది. ఇప్పటికే దేశంలో కొన్ని రూట్లలో వందే భారత్ రైళ్లు ప్రయాణిస్తున్నాయి. అయితే అవన్నీ కూడా కూర్చొని ప్రయాణం చేసేవే. ఇంకా స్లీపర్ రైళ్ళను ప్రవేశపెట్టలేదు. ఇప్పుడు తొలిసారి హై స్పీడ్, లగ్జరీ, హైటెక్స్ సౌకర్యాలతో తొలి వందే భారత్ స్లీపర్ రైలు రాబోతోంది. ఇదే మనదేశంలో మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలుగా చెప్పుకోవాలి. సుదూర ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేయడానికి వందే భారత్ రైలు ప్రవేశపెడుతున్నారు.
ఇండియన్ ఎక్స్ ప్రెస్ చెబుతున్న ప్రకారం గత నెలలో గుజరాత్‌లోని భావ్ నగర్లో జరిగిన కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పాల్గొన్నారు. జూలై 25న పార్లమెంటుకు ఇచ్చిన సమాధానంలో మొదటి రేక్ సిద్ధం చేశామని, ఫీల్డ్ ట్రయల్స్ కూడా పూర్తయ్యాయని.. త్వరలోనే ఇది ప్రారంభమవుతుందని చెప్పారు.