మోడీ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. నిత్యావసర వస్తువులు, సేవలపై జీఎస్టీని తొలగించింది. దీంతో అనేక వస్తువులపై ఇకపై జీఎస్టీ ఉండదు. దీని వల్ల సామాన్య ప్రజలకు ఖర్చులు తగ్గుతాయి. పేదలు, మధ్యతరగతి వారి జీవితం మరింత సులువుగా మారుతుంది.
భారత ప్రజలకు మోడీ ప్రభుత్వం పెద్ద కానుకను ఇచ్చింది. దసరా, దీపావళి పండుగులకు ప్రజలు ఇక ఆనందంగా సిద్ధమైపోవచ్చు. ఎందుకంటే పేదలకు, మధ్యతరగతి వారికి అత్యవసరమైన నిత్యావసర వస్తువులు, సేవలపై జీఎస్టీని పూర్తిగా తొలగించింది. 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీని వల్ల పాలు, పనీర్, రొట్టె, చపాతీ, విద్యా సామాగ్రి, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ వంటి వాటిపై ఇకపై జీఎస్టీ ఉండదు. పేదల కూడా ఇకపై ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినవచ్చు. సంతోషంగా జీవించవచ్చు.
25
మోడీ ప్రభుత్వం
జీఎస్టీ సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో జీఎస్టీ పన్ను శాతాల్లో ఎన్నో మార్పులు చేశారు. గతంలో 5 శాతం పన్ను విధించిన పాలు, పెరుగు, పనీర్ వంటి వాటిపై ఇకపై జీఎస్టీ ఉండదు. రొట్టె, చపాతీ వంటి భారతీయ ఆహార పదార్థాలు కూడా పన్ను మినహాయింపు పొందాయి. ఇంకా ఎన్నో ఆహారాలపై జీఎస్టీ ఉండదు. ఆహారంపై పన్ను తీసేయడం వల్ల ఎంతో మంది ఆహారానికి లోటు లేకుండా జీవించే అవకాశం ఉంది.
35
నిత్యావసర వస్తువులకు నో పన్ను
మనదేశంలో చదువుకు ఎంతో విలువ ఉంది. అందుకే నోటు పుస్తకాలు, పెన్సిల్, ఎరేజర్, షార్పనర్ వంటి స్టేషనరీ వస్తువులపై కూడా పన్ను మినహాయింపు ఇచ్చారు. వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను కూడా పన్నులేకుండా చేశారు. మ్యాప్‌లు, చార్టులు, గ్లోబ్‌లు, మందులు వంటి వాటిని ఇకపై తక్కువ ధరకే లభిస్తాయి.
జీఎస్టీ కౌన్సిల్ ఈసారి ఎంతో పెద్ద నిర్ణయాలే తీసుకుందని చెప్పాలి. ఇప్పటివరకు ఉన్న 12%, 28% పన్ను స్లాబ్‌లను రద్దు చేసింది. ఇకపై వస్తువులు 5 శాతం లేదా 18 శాతం పన్ను స్లాబ్‌లలోనే ఉంటాయి. దీంతో మధ్యతరగతి ప్రజలకు కొన్ని వస్తువులు చవకగా లభించే అవకాశం పెరిగింది.
55
చిన్న వ్యాపారులకు ఊరట
చిన్న, మధ్య తరహా వ్యాపారులకు ఈ జీఎస్టీ మార్పులు ఎంతో ఉపశమనం కలిగిస్తాయి. జీఎస్టీ రిజిస్ట్రేషన్, పన్ను చెల్లింపు ప్రక్రియలను సులభతరం చేస్తున్నారు. నిపుణులు చెబుతున్న ప్రకారం ఈ మార్పులన్నీ పన్ను విధానాన్ని పారదర్శకంగా, న్యాయబద్ధంగా మార్చి, అభివృద్ధి వైపు నడిపించే ఒక పెద్ద ప్రణాళికలో భాగం.