దేశంలో UPI చెల్లింపుల కోసం.. ఎక్కువ మంది ఉప‌యోగిస్తున్న‌ యాప్ ఏంటో తెలుసా.?

Published : Oct 15, 2026, 07:46 PM IST

UPI Payments: కూరగాయలు కొనడం నుంచి షాపింగ్, విద్యుత్ బిల్లుల చెల్లింపు వరకు చాలామంది UPI సేవలను ఉపయోగిస్తున్నారు. ర‌క‌ర‌కాల యూపీఐ యాప్స్ అందుబాటులో ఉండ‌గా దేశంలో ఎక్కువ మంది ఏ యాప్‌ను వాడుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
యూపీఐ మార్కెట్‌లో అగ్రస్థానంలో ఫోన్‌పే

భారత్‌లో UPI చెల్లింపుల యాప్‌ల మార్కెట్ వాటా పరంగా ఫోన్‌పే మొదటి స్థానంలో ఉంది. గూగుల్ పే రెండో స్థానంలో ఉండగా, పేటీఎమ్‌ మూడో స్థానంలో నిలిచింది. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, ఫోన్‌పే, గూగుల్‌పే రెండింటి మార్కెట్ వాటా కలిపి 77.9 శాతంగా ఉంది. అంటే UPI యాప్‌ల మార్కెట్‌లో ఈ రెండు సంస్థల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.

25
ఏ యాప్‌కు ఎంత మార్కెట్ వాటా ఉందంటే?

యూపీఐ చెల్లింపుల యాప్‌ల మార్కెట్ వాటా వివరాల విష‌యానికొస్తే 45.6 శాతంతో ఫోన్‌పే మొద‌టి స్థానంలో ఉంది. 32.3 శాతంతో గూగుల్ పే రెండో స్థానంలో, 8 శాతం వాటాతో పేటీఎమ్ మూడో స్థానంలో ఉంది. అలాగే 4.4 శాతంతో నావి 4వ స్థానం, 1.7 శాతంతో సూప‌ర్ మ‌నీ, 1 శాతంతో భీమ్ యాప్‌, 0.9 శాతంతో ఫామ్‌యాప్‌, 0.7 శాతంతో వాట్సాప్ పే, 0.6 శాతంతో క్రెడ్‌, 0.6 శాతంతో యాక్సిస్ బ్యాంక్ యాప్‌లు త‌ర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

35
పేటీఎమ్ మూడో స్థానంలోనే ఎందుకు ఉంది?

ఒకప్పుడు డిజిటల్ చెల్లింపుల్లో విస్తృతంగా గుర్తింపు పొందిన Paytm.. ప్రస్తుతం UPI మార్కెట్ వాటా పరంగా మూడో స్థానంలో ఉంది. ఈ యాప్‌కు 8 శాతం వాటా ఉండగా, PhonePe, Google Pay రెండింటి వాటా కలిపి 77.9 శాతంగా ఉంది. ఈ వ్యత్యాసం చూస్తే UPI చెల్లింపుల రంగంలో ఈ రెండు యాప్‌లకు ఉన్న ఆదరణ అర్థమవుతుంది.

45
UPI చెల్లింపులపై MDR ఛార్జీల అమలు వాయిదా

మరోవైపు, UPI చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీల అమలు అంశం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం తెలిసిందే. ఈ ఛార్జీలను అక్టోబర్ 15 నుంచి అమలు చేయాలని భావించినప్పటికీ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఎంపిక చేసిన కొన్ని UPI లావాదేవీలకు సంబంధించిన నిర్ణయాన్ని దీపావళి తర్వాతకు వాయిదా వేసింది. కొత్త తేదీని సంబంధిత వర్గాలకు తర్వాత తెలియజేయనుంది.

NPCI సెప్టెంబర్ 15న ప్రకటించిన ప్రతిపాదన ప్రకారం, రూ.2,000 కంటే ఎక్కువ విలువ కలిగిన కొన్ని వ్యాపార సంబంధిత UPI చెల్లింపులపై 0.4 శాతం ఛార్జీ విధించాలని భావించారు. ఒక్కో లావాదేవీపై ఈ ఛార్జీ గరిష్ఠంగా రూ.300కు పరిమితం చేయాలని ప్రతిపాదించారు.

55
ఛార్జీలు అందరికీ వర్తిస్తాయా.?

అయితే ఈ ఛార్జీలు అన్ని UPI చెల్లింపులకూ వర్తిస్తాయని భావించకూడదు. ఇవి ఎంపిక చేసిన కొన్ని వ్యాపార లావాదేవీలకు సంబంధించిన ప్రతిపాదన మాత్రమే. సాధారణ వ్యక్తులు ఒకరి నుంచి మరొకరికి చేసే UPI నగదు బదిలీలకు ఇవే నిబంధనలు వర్తిస్తాయని అర్థం కాదు. అమలు తేదీ, వర్తించే లావాదేవీల వివరాలపై NPCI నుంచి వచ్చే అధికారిక ప్రకటనను పరిశీలించాలి.

Read more Photos on
click me!

Recommended Stories