UPI పేమెంట్లలో మోసపోయారా? అయితే, ఇలా చేయండి మీ డబ్బులు వస్తాయి

First Published | Aug 31, 2024, 10:06 AM IST

UPI Payment Fraud Complaint Procedure : యూపీఐ (UPI) చెల్లింపులకు సంబంధించి మోసాల బారినపడిన వారు చాలా మందే ఉన్నారు. ఫిర్యాదులు క్రమంగా పెరుగుతున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి నిబంధనలు మరింత కఠినతరం చేస్తున్నప్పటికీ, యూపీఐ చెల్లింపుల సమయంలో మోసం జరిగితే ఏం చేయాలి? వెంటనే ఎవరికి ఫిర్యాదు చేయాలి? మీ డబ్బును ఎలా తిరిగి పొందాలనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

how you can recover money lost in UPI or banking fraud

ఆన్‌లైన్ లావాదేవీల సౌలభ్యం మన రోజువారీ జీవితంలో అంతర్భాగంగా మారింది. యూపీఐతో డబ్బుల లావాదేవీలు మరింత సులభం అయింది. అయినప్పటికీ యూపీఐ (UPI), ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌలభ్యం వాటి విస్తృత వినియోగం క్రమంలో మోసగాళ్ల బారినపడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఆన్‌లైన్ చెల్లింపులలో సౌలభ్యంతో పాటు మోసాలకు కూడా అవకాశాలు పెరిగిన సందర్భాలను అనేక రిపోర్టులు ప్రస్తావించాయి. ఇప్పటికే చాలా కేసులు వెలుగులోకి వచ్చాయి. కాబట్టి ఇలాంటి మోసాల బారినపడితే ఏం చేయాలి? మీ డబ్బులు మీ తెలియని వారికి వెళ్లిపోతే ఏం చేయాలి? మీ డబ్బులను ఎలా తిరిగి పొందవచ్చు? అనే విషయాలను ఎప్పటికప్పుడు ఆర్బీఐ వినియోగదారులతో పంచుకుంటూనే ఉంది. ఆ వివరాలు గమనిస్తే..

how you can recover money lost in UPI or banking fraud

మీరు యూపీఐ చెల్లింపుల సమయంలో మీరు మోసపోయినట్టుగా, మీ డబ్బులు పోయినట్టుగా గుర్తిస్తే వెంటనే మీరు మీ యూపీఐ (UPI) సర్వీస్ ప్రొవైడర్ కు తెలియజేయాలి. అంటే యూపీఐ సర్వీసులను ప్రధానంగా చాలా మంది GPay, PhonePe, Paytm వంటి వాటిని అధికంగా వాడుతున్నారు. ఇవే కాకుండా మరే సర్వీస్ ప్రొవైడర్ సేవలు అందుకుంటున్న మీరు వారికి వెంటనే ఫిర్యాదు చేయాలి. అలాగే, మీ డబ్బులు పోవడం, మోసం జరిగిందని గుర్తించిన వెంటనే ఫిర్యాదు చేయడంతో పాటు మళ్ళీ ఎలాంటి స్కామ్ జరగకుండా మీ UPI చెల్లింపు యాప్‌ను నిలిపివేయండి. అంటే మీరు యూపీఐకి జత చేసిన మీ బ్యాంకు ఖాతాలను తీసివేయాలి.

Latest Videos


how you can recover money lost in UPI or banking fraud

యూపీఐ చెల్లింపు సమయంలో మీరు మోసపోయినా మీరు మీ డబ్బును తిరిగి పొందవచ్చు. అలాగే, తప్పుడు UPI లావాదేవీ జరిగినా మీరు మీ డబ్బును పొందవచ్చు. మోసంతో కోల్పోయిన మీ డబ్బు రీఫండ్ కోసం పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ (PSP) లేదా TPAP యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలి. డబ్బు తిరిగి రాకపోతే, మీ UPI సర్వీస్ ప్రొవైడర్ స్పందించకుంటే, npci.org.inలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి.

how you can recover money lost in UPI or banking fraud

UPI చెల్లింపు సమయంలో మోసం లేదా ఇతర ఫిర్యాదుల కోసం, భీమ్ టోల్-ఫ్రీ నంబర్ +91 22 40009100 లేదా హెల్ప్‌లైన్ నంబర్ 022 4050 8500కు కాల్ చేసి మీ ఫిర్యాదులు చేయవచ్చు. దీనితో పాటు, మీరు cms.rbi.org.in లేదా crpc@rbi.org.inకి ఇ-మెయిల్ పంపడం ద్వారా కూడా మీ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు. అంతేకాకుండా 1930కు కాల్ చేసి కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఇవి మీకు ఉచితంగానే లభిస్తాయి. అలాగే, బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్, డిజిటల్ ఫిర్యాదులు కూడా చేయవచ్చు. సమస్య 30 రోజుల పాటు కొనసాగితే, డిజిటల్ ఫిర్యాదుల కోసం బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ లేదా అంబుడ్స్‌మన్‌ను సంప్రదించాలి. డిజిటల్ లావాదేవీల కోసం RBI మార్గదర్శకాలను అనుసరించి అంబుడ్స్‌మన్‌కు అధికారిక ఫిర్యాదును సమర్పించాలి. మీరు దీన్ని ఆన్‌లైన్‌లో cms.rbi.org.inలో చేయవచ్చు లేదా crpc@rbi.org.inలో బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కి ఇమెయిల్ పంపడం ద్వారా కూడా చేయవచ్చు.
 

how you can recover money lost in UPI or banking fraud

అనధికార లావాదేవీ గురించి వీలైనంత త్వరగా మీ బ్యాంక్‌కి తెలియజేయండి. ముఖ్యంగా, రూ. 25,000 వరకు సంభావ్య నష్టాలను నివారించడానికి మీ నివేదికను మూడు రోజుల్లోగా ఫైల్ చేయండి. అలాగే, బ్యాంకు మీ బాధ్యతను పరిమితం చేయడానికి మోసం గురించి బీమా కంపెనీకి తెలియజేస్తుంది.
బ్యాంకు నుండి పరిహారం 10 పని దినాలలో ప్రాసెస్ చేస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ స్కామ్‌లు లేదా లాటరీ మోసం వంటి ఇతర సందర్భాల్లో, మోసగాళ్లు బ్యాంక్ ఖాతాలను లక్ష్యంగా చేసుకుంటారు. మీరు డబ్బు పోగొట్టుకుంటే, బ్యాంక్ అధికారులను సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇక మోసాలను నివారించడానికి, మీ UPI IDని మీ బ్యాంక్ ఖాతాకు నేరుగా లింక్ చేయవద్దు. UPI మోసాలను నివారించడానికి వాలెట్‌ని ఉపయోగించండి. తద్వారా పెద్ద మోసాలను నివారించవచ్చు. మీ UPI ID,  పిన్‌ను ఎవరికీ చెప్పవద్దు. 

click me!