సెప్టెంబర్‌లో మార్కెట్లో సందడి చేసే కొత్త కార్లు ఇవే..

First Published | Aug 30, 2024, 1:03 PM IST

టాటా మోటార్స్, హ్యుందాయ్, ఎంజి, మెర్సిడెస్-బెంజ్ వంటి కార్ల తయారీదారులు తమ కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సెప్టెంబర్ నెలలో కొనుగోలుదారుల కోసం రెడీగా ఉన్న కార్ల వివరాలు తెలుసుకుందాం.
 

దేశంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెలవులు సమీపిస్తున్న నేపథ్యంలో భారతీయ ఆటోమొబైల్ రంగం కొత్త కార్ల విడుదలలకు సిద్ధమవుతోంది. మెర్సిడెస్-బెంజ్, హ్యుందాయ్, ఎంజి, టాటా మోటార్స్ వంటి ఆటోమొబైల్ తయారీదారులు తమ కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే నెలలో కొనుగోలుదారుల కోసం ప్రవేశ పెడుతున్న కార్ల వివరాలు తెలుసుకుందాం. 

MG విండ్సర్ EV

కామెట్, ZS EVల తర్వాత, MG మోటార్ ఇండియా తన మూడవ ఎలక్ట్రిక్ వాహనం(EV) విండ్సర్ EVని మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. దీని ప్రారంభ తేదీ సెప్టెంబర్ 11. ఇది కొత్త పేరుతో వూలింగ్ క్లౌడ్ EVగా ఉంటుంది. వూలింగ్ క్లౌడ్ EV అనేక దేశాలలో 50.6kWh బ్యాటరీ ప్యాక్‌తో 460 కి.మీల పరిధిని, 37.9kWh యూనిట్ 360 కి.మీల పరిధిని కలిగి ఉంది. పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో కలిపి, ముందు అమర్చబడిన ఎలక్ట్రిక్ మోటార్ 200Nm టార్క్ 136PS హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ముప్పై నిమిషాల్లో DC ఛార్జర్‌తో EVని ముప్పై నుండి వంద శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.


హ్యుందాయ్ అల్కాజర్

సెప్టెంబర్ 9న హ్యుందాయ్ 2024 అల్కాజర్ ఫేస్‌లిఫ్ట్‌ను దేశంలోకి ప్రవేశపెట్టనుంది. ఆగస్టు 26న, కారు తయారీ సంస్థ అధికారికంగా లాంచ్ చేయడానికి ముందు ఇంటీరియర్ చిత్రాలను విడుదల చేసింది. దీని ఆధునిక డిజైన్ శాంటా ఫే, ఎక్స్‌టెర్, క్రెటాను పోలి ఉంటుంది. దీని క్యాబిన్ కూడా క్రెటా నుండి ప్రేరణ పొంది తయారు చేశారు. రెండు 10.25-అంగుళాల స్క్రీన్‌లు, కొత్త బాస్ మోడ్, వెంటిలేటెడ్ ఫ్రంట్, రియర్ సీట్లు, మెమరీ సెట్టింగ్‌లతో కూడిన పవర్డ్ డ్రైవర్ సీట్, వన్-టచ్ ఫోల్డబుల్ సెకండ్ రో సీట్, డ్యూయల్-జోన్ టెంపరేచర్ కంట్రోల్, USB టైప్-సి, టైప్-ఎ పోర్ట్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్ మరిన్ని సదుపాయాలు ఉన్నాయి. నోబెల్ బ్రౌన్, హేజ్ నేవీ బ్లూ రంగుల డ్యూయల్-టోన్ కలయికతో  ఈ కారు రంగు ఉంది. 

మెర్సిడెస్-మేబ్యాక్

లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్-బెంజ్ భారతదేశంలో మేబ్యాక్ EQS SUV అనే పూర్తి ఎలక్ట్రిక్ వాహనాన్ని దేశంలో విడుదల చేయనుంది. విదేశాల్లో ఇప్పటికే ఉన్న మెర్సిడెస్-మేబ్యాక్ EQS 680 రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, 107.8kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది 600 కి.మీల వరకు వెళ్లగలదట. 950 Nm గరిష్ట టార్క్, 658 PS ఈ మోటార్ల ద్వారా ఉత్పత్తి చేయబడతాయి. దీనితో విలాసవంతమైన మేబ్యాక్ 210 mph గరిష్ట వేగాన్ని చేరుకుంటుంది. 4.4 సెకన్లలో 0 నుండి 100 mph వేగాన్ని అందుకోగలదు. మేబ్యాక్ EQS దాని గరిష్ట 22kW AC ఛార్జింగ్ ,200kW DC రాపిడ్ ఛార్జింగ్ సామర్థ్యాలతో 30 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది.

టాటా కర్వ్

Cuvv EVని ప్రవేశపెట్టిన తర్వాత టాటా మోటార్స్ సెప్టెంబర్ 2, 2024న కొత్త కర్వ్‌ను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. మూడు ఇంజిన్ ఎంపికలు దీనికి శక్తినిస్తాయి. అందులో ఒకటి 118 హార్స్‌పవర్, 260 Nm టార్క్‌తో 1.5-లీటర్ డీజిల్ యూనిట్ కాగా, 125 హార్స్‌పవర్, 225 Nm టార్క్‌తో కొత్త 1.2-లీటర్ TGDi టర్బో-పెట్రోల్ ఇంజిన్ రెండోది. ఇక మూడోది ఏంటంటే 120 హార్స్‌పవర్, 170 Nm టార్క్‌తో 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మోటార్. ఆరు-స్పీడ్ మాన్యువల్, ఏడు-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ప్రతి ఇంజిన్‌కు అందుబాటులో ఉంటుంది. 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, ప్యాడిల్ షిఫ్టర్‌లు, వెంటిలేటెడ్ సీట్లు, ఆటో-హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, యాంబియంట్ లైటింగ్, ప్రకాశవంతమైన ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఇందులో ఉన్నాయి.  అంతేకాకుండా  వెల్కమ్, గుడ్‌బై లైట్ యానిమేషన్‌లు, సంజ్ఞ నియంత్రణతో పవర్డ్ బూట్ ఓపెనింగ్, AQI డిస్‌ప్లేతో కూడిన ఎయిర్ ప్యూరిఫైయర్, కొత్త iRA యాప్ సపోర్ట్, SOSతో కూడిన టెలిమాటిక్స్, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, 45W USB టైప్-సి పోర్ట్‌లు, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, ESP సదుపాయాలున్నాయి. సేఫ్టీ కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, చల్లబడిన గ్లోవ్ బాక్స్, TPMS, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లు, 20 ఫంక్షన్‌లతో లెవల్ 2 అటానమీ కర్వ్ దీని ప్రత్యేకతలు. 

Latest Videos

click me!