UPI Lite: యూపీఐ సేవల్లో కీలక మార్పు.. ఇకపై యూపీఐ లైట్‌లో కూడా ఆ ఫీచర్‌

Published : Feb 26, 2025, 01:49 PM IST

దేశంలో రోజురోజుకీ డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయాయి. మారుమూల గ్రామాల్లో కూడా యూపీఐ పేమెంట్స్‌ను యాక్సెప్ట్‌ చేస్తున్నారు. ప్రతీ ఒక్కరికీ స్మార్ట్ ఫోన్‌ అందుబాటులోకి రావడం ఇంటర్నెట్‌ ఛార్జీలు తగ్గడంతో యూపీఐ సేవలు పెరుగుతున్నాయి. యూపీఐలో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తున్న ఎన్‌పీసీఐ తాజాగా మరో కొత్త ఫీచర్‌ తీసుకొచ్చింది..   

PREV
14
UPI Lite: యూపీఐ సేవల్లో కీలక మార్పు.. ఇకపై యూపీఐ లైట్‌లో కూడా ఆ ఫీచర్‌

చిన్న మొత్తాల్లో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు, పిన్‌ లేకుండానే పేమెంట్స్‌ చేసే ఉద్దేశంతో యూపీఐ లైట్‌ పేరుతో ఫీచర్‌ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందుకోసం యూపీఐ పేమెంట్‌ లైట్‌లో ముందుగా యూజర్లు మనీ యాడ్ చేసుకోవాలనే విషయం తెలిసిందే. ఆ మొత్తం నుంచి లావాదేవీలు చేసుకోచ్చు. అయితే ఈ సేవలను మరింత మెరుగుపరిచేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా అడుగులు వేస్తోంది. 
 

24

ఇప్పటి వరకు యూపీఐ లైట్‌లో 'వన్‌ వే' సేవ మాత్రమే అందుబాటులో ఉంది. అంటే యూజర్లు కేవలం ఇందులో మనీ యాడ్‌ చేసుకునే అవకాశం మాత్రమే ఉండేది. ఈ వ్యాలెట్‌ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకునే ఛాన్స్ ఉండేది కాదు. అయితే తాజాగా తీసుకొస్తున్న కొత్త ఫీచర్‌ సహాయంతో యూజర్లు యూపీఐ లైట్‌లో డబ్బులు జమ చేయడమే కాకుండా విత్‌డ్రా చేసుకునే అవకాశం కూడా కల్పించనున్నారు. 
 

34

యూపీఐ లైట్‌లో ఉన్న డబ్బును పూర్తిగా విత్‌డ్రా చేసుకోవాలంటే అకౌంట్‌ను క్లోజ్‌ చేయాల్సి ఉండేది, లేదంటే యూపీఐ లైట్‌ నుంచి పేమెంట్‌ చేసుకునే అవకాశం ఉండేది. అయితే ఇకపై నేరుగా యూపీఐ లైట్‌లోని మొత్తాన్ని మీ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. త్వరలోనే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నారు. నగదు విత్‌డ్రాకు వీలు కల్పించాలని పేర్కొంటూ బ్యాంకులు, పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు లేఖ రాసింది. మార్చి 31 నాటికి నగదు విత్‌డ్రా కోసం ‘ట్రాన్స్‌ఫర్‌ అవుట్‌’ ఆప్షన్‌ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.
 

44

పెరుగుతోన్న యూపీఐ లావాదేవీలు.. 

ఇదిలా ఉంటే దేశంలో యూపీఐ పేమెంట్స్ రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. యూపీఐ ప్లాట్‌ఫామ్స్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నా లావాదేవీలు మాత్రం తగ్గడం లేదు. 2025 జనవరిలో యూపీఐ ద్వారా 16.99 బిలియన్ లావాదేవీలు నమోదయ్యాయి, వీటి మొత్తం విలువ సుమారు రూ. 23.48 లక్షల కోట్లు కావడం విశేషం. గత ఏడాదితో పోల్చితే 39 శాతం పెరగడం విశేషం. 

click me!

Recommended Stories