బోట్ ఎక్స్‌టెన్డ్ ప్రో(boAt Xtend Pro):
స్పోర్ట్స్ ఇష్టపడేవాళ్లకి బెస్ట్ ఛాయిస్ ఈ స్మార్ట్ వాచ్. స్టైలిష్ డిజైన్, 1.75-inch HD డిస్‌ప్లే కలిగిన ఈ స్మార్ట్ వాచ్ మీ చేతికి రెట్టింపు అందాన్నిస్తుంది. వాయిస్ కంట్రోల్ ఫెసిలిటీ ఉండటం వల్ల కాల్స్ ఈజీగా మాట్లాడొచ్చు. 700+ స్పోర్ట్స్ మోడ్‌లు కూడా ఇందులో ఉన్నాయి. గుండె వేగం, నిద్ర విధానం, మానసిక ఒత్తిడిని ట్రాక్ చేసే ఫెసిలిటీలు మీకు మంచి సమాచారాన్ని అందిస్తాయి. నీళ్లలో తడిసినా దీనికి ఏమీ కాదు. అందుకే ఇది ఆటగాళ్లకు బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 10 రోజుల వరకు బ్యాటరీ వస్తుంది.