Seven Seater Family Cars: ఇండియాలో రాబోయే 7 సీటర్ ఫ్యామిలీ కార్లు ఇవే!

Published : Mar 13, 2025, 05:03 PM IST

Seven Seater Family Cars: ఇండియాలో SUV మార్కెట్ వేగంగా పెరుగుతోంది. తమ మార్కెట్ స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి మారుతి సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా, టొయోటా వంటి ప్రముఖ కంపెనీలు ఈ ఏడాది SUV విభాగంలో కొత్త మోడళ్లను విడుదల చేయనున్నాయి. 2025లో రాబోయే మొదటి నాలుగు 7 సీటర్ SUVలు, ఫ్యామిలీ కార్ల గురించి వివరాలు ఇక్కడ ఉన్నాయి. 

PREV
14
Seven Seater Family Cars: ఇండియాలో రాబోయే 7 సీటర్ ఫ్యామిలీ కార్లు ఇవే!

7 సీటర్ మారుతి గ్రాండ్ విటారా

మారుతి సుజుకి ఈ ఏడాది ఈ-విటారా, ఫ్రాంక్స్ హైబ్రిడ్, గ్రాండ్ విటారా ఆధారంగా 7 సీటర్ SUVతో సహా మూడు ముఖ్యమైన లాంచ్‌లను ప్లాన్ చేస్తోంది. 7 సీటర్ గ్రాండ్ విటారా దాని 5 సీటర్ వెర్షన్‌ లో ఉన్న ఫీచర్స్ తోనే మార్కెట్ లోకి రానుంది. అయితే ఇది పొడవుగా ఉంటుంది. అదనపు వరుస సీట్లను కలిగి ఉంటుంది. రీడిజైన్ చేసిన బంపర్‌లు, కొత్త అల్లాయ్ వీల్స్, అప్‌డేట్ చేసిన హెడ్‌ల్యాంప్, టెయిల్‌ల్యాంప్ క్లస్టర్‌లు వంటి చిన్న కాస్మెటిక్ మార్పులు కూడా ఉంటాయి. 

24

7 సీటర్ టొయోటా హైరైడర్

మారుతి సుజుకి మాదిరిగానే టొయోటా కూడా ఈ సంవత్సరం చివర్లో మూడు హైరైడర్ వెర్షన్‌ను విడుదల చేస్తుంది. 7 సీటర్ టొయోటా హైరైడర్ మొత్తం డిజైన్, స్టైలింగ్ దాని 5 సీటర్ వెర్షన్‌ను పోలి ఉంటాయి. ఇది మెరుగైన మెటీరియల్ క్వాలిటీ, ఫిట్, ఫినిషింగ్‌తో వస్తుంది. పవర్ కోసం 1.5L K15C పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్, 1.5L అట్కిన్సన్ సైకిల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లను ఈ కారులో ఫిట్ చేస్తున్నారు. 

34

మహీంద్రా XUV700 ఫేస్‌లిఫ్ట్

మహీంద్రా XUV700 భారతదేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న SUVలలో ఒకటి. ఇప్పుడు ఈ SUV 2025 ద్వితీయార్థంలో పెద్ద మిడ్‌లైఫ్ అప్‌డేట్‌తో రానుంది. ఈ ఫేస్‌లిఫ్ట్ కారులో కూడా XUV700 ఇంజిన్ సెటపే ఉంటుంది. కాకపోతే మెరుగైన స్టైలింగ్, ఇంటీరియర్‌ మారే అవకాశం ఉంది. ఈ కాారులో 16 స్పీకర్ హర్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, హెడ్ అప్ డిస్‌ప్లే, ట్రిపుల్ స్క్రీన్ సెటప్‌తో సహా కొన్ని హై-ఎండ్ ఫీచర్లు ఉంటాయి. 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ అనే రెండు గేర్‌బాక్స్ ఆప్షన్‌లతో 2.0L టర్బో పెట్రోల్, 2.2L డీజిల్ ఇంజిన్‌లతో మహీంద్రా XUV700 ఫేస్‌లిఫ్ట్ పనిచేస్తుంది.

44

మహీంద్రా XEV 7e

మహీంద్రా అండ్ మహీంద్రా 2025 చివరి నాటికి XUV700 ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా విడుదల చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ SUV పేరు 'మహీంద్రా XEV 7e'గా ఉంటుందని సమాచారం. ఇందులో 59kWh, 79kWh బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. చిన్న బ్యాటరీ ప్యాక్ అయితే 542 కి.మీ. పెద్ద బ్యాటరీ ప్యాక్ వెహికల్ అయితే పూర్తి ఛార్జ్‌పై 656 కి.మీ. ప్రయాణించగలదు. ఈ కారులో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ కూడా ఉంటుందని సమాచారం. 

click me!

Recommended Stories