వేసవిలో మీ బైక్ ఇంజిన్ ఆయిల్, టైర్, బ్యాటరీ, బ్రేకులు ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఇది మీ బైక్ పనితీరును పెంచడమే కాకుండా సురక్షితమైన ప్రయాణానికి సహాయపడుతుంది. వీటిల్లో మరింత ముఖ్యమైన విషయం ఇంజిన్ ఆయిల్. వేసవిలో మోటార్ సైకిల్ ఇంజిన్ చలికాలం కంటే వేడిగా ఉంటుంది. ఇంజిన్ ఆయిల్ తక్కువగా ఉన్నా లేదా ఆయిల్ సరిపడినంత లేకపోయినా అది వేడెక్కుతుంది. దీంతో ఇంజిన్ పాడవ్వడానికి ఛాన్స్ ఉంది.
బైక్ మెయింటెనెన్స్ టిప్స్
అవసరమైనప్పుడు ఇంజిన్ ఆయిల్ ఎప్పటికప్పుడు చెక్ చేసి మార్చడం వల్ల మీ బైక్ పర్ఫక్ట్ గా పనిచేస్తుంది. మీ ప్రయాణంలో అనుకోకుండా ఆగిపోకుండా లాంటి సమస్యలు రావు. మరో ముఖ్యమైన విషయం టైర్ల మెయింటెనెన్స్. బైక్ పనితీరుకు ఇంజిన్ ఎంత ముఖ్యమో, సురక్షితమైన ప్రయాణానికి టైర్లు కూడా అంతే ముఖ్యం.
వేసవి కాలంలో టైర్లు పేలతాాయి
వేసవిలో వేడి వల్ల టైర్లు పేలే అవకాశం ఉంది. ముఖ్యంగా అప్పటికే అరిగిపోయి ఉంటే ఎండ వేడికి పేలిపోవచ్చు. అందుకే వేసవి ప్రారంభంలోనే టైర్లను పూర్తిగా చెక్ చేయాలి. పగుళ్లు, అరుగుదల లేదా ఏదైనా డ్యామేజ్ ఉంటే వాటిని మార్చడం వల్ల ప్రమాదాలు జరగకుండా ఉంటాయి.
ఒకవేళ మీది ఎలక్ట్రిక్ వెహికల్ అయితే బైక్ బ్యాటరీపై శ్రద్ధ పెట్టండి.
బైక్ బ్యాటరీ చెక్ చేసుకోండి
బ్యాటరీ టెర్మినల్స్ లోకి మురికి, తుప్పు చేరితే మీ బైక్ కి స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనికి కారణం మీ బైక్ బ్యాటరీ పాడైపోవడమే. అందుకే బైక్ నడుపుతున్నప్పుడు సడెన్ గా ఆగిపోతుంది. టెర్మినల్స్ శుభ్రం చేయడం, బ్యాటరీ పరిస్థితిని చెక్ చేయడం వల్ల ఇలాంటి సమస్యలను నివారించవచ్చు. చివరిగా మీ బ్రేకులు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి.
బ్రేకింగ్ సిస్టమ్ సరిగ్గా ఉండాలి
వేసవిలో రోడ్డు వేడక్కడం వల్ల బ్రేకులపై ఎక్కువ ఒత్తిడి పడి త్వరగా అరిగిపోతాయి. బ్రేకింగ్ లేట్ అయితే ప్రమాదకరం. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి ఎండలు పెరగకముందే మీ బ్రేకులను చెక్ చేసి అవసరమైతే మార్చండి. ఈ ముఖ్యమైన విషయాలను సరిగ్గా చూసుకోవడం వల్ల మీ బైక్ పనితీరు మెరుగుపడుతుంది.
ఇది కూడా చదవండి రూ.లక్ష లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు: ఒక్క ఛార్జ్ కే 176 కి.మీ రేంజ్