Union Budget: రైల్వే ప్ర‌యాణికుల‌కు బంప‌రాఫ‌ర్.. 50 శాతం డిస్కౌంట్‌పై బ‌డ్జెట్‌లో కీల‌క ప్ర‌క‌ట‌న‌.?

Published : Jan 31, 2026, 11:48 AM IST

Union Budget: ఫిబ్ర‌వ‌రి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్న బ‌డ్జెట్‌పై ఎన్నో అంచ‌నాలు ఉన్నాయి. ఎలాంటి వ‌రాల జ‌ల్లు కురిపించ‌నున్నారో అని అంద‌రూ ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఓ వార్త అంద‌రిలోనూ ఆస‌క్తిని పెంచింది. 

PREV
15
బడ్జెట్‌ 2026పై దేశవ్యాప్తంగా అంచనాలు

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ త్వరలో బడ్జెట్‌ 2026ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. మోదీ ప్రభుత్వ మూడో పదవీకాలంలో ఇది రెండో పూర్తి బడ్జెట్‌. అన్ని వర్గాల ప్రజలు ఈ బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా వృద్ధుల జీవన సౌకర్యాలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుందనే అంచనాలు పెరిగాయి.

25
వృద్ధుల ప్రయాణంపై దృష్టి

సీనియర్ సిటిజన్లు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అంశం రైల్వే టికెట్ రాయితీ. కోవిడ్‌కు ముందు ఈ సౌకర్యం వల్ల వృద్ధులకు ప్రయాణ వ్యయం గణనీయంగా తగ్గేది. మహమ్మారి సమయంలో ఈ రాయితీ నిలిపివేయడంతో వృద్ధులపై అదనపు భారం పడింది. ఇప్పుడు బడ్జెట్‌ 2026లో ఈ అంశం తిరిగి తెరపైకి వచ్చింది.

35
కోవిడ్‌కు ముందు అమల్లో ఉన్న రాయితీ

మహమ్మారి రావడానికి ముందు భారతీయ రైల్వేలు వృద్ధులకు ప్రత్యేక రాయితీలు అందించేవి. 60 ఏళ్లు పైబడిన పురుషులకు టికెట్ ధరపై 40 శాతం తగ్గింపు. 58 ఏళ్లు దాటిన మహిళలకు 50 శాతం తగ్గింపు ఉండేది. ఈ సౌకర్యం స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ కోచ్‌లలో అందుబాటులో ఉండేది. 2020 మార్చిలో లాక్‌డౌన్ కారణంగా రైల్వే ఆదాయం భారీగా తగ్గడంతో ఈ విధానం తాత్కాలికంగా నిలిచిపోయింది.

45
రైల్వే శాఖ తాజా ప్రతిపాదన

తాజా సమాచారం ప్రకారం వృద్ధుల ప్రయాణ సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త ప్రతిపాదనను సిద్ధం చేసింది. రాయితీ పునరుద్ధరణపై ఇంకా తుది నిర్ణయం వెలువడకపోయినా, బడ్జెట్ సమావేశాల్లో దీనిపై చర్చ జరగనున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం అమలైతే రైల్వేలకు ఏటా సుమారు రూ.1600 నుంచి రూ.2000 కోట్ల వరకు అదనపు వ్యయం అవుతుందని అంచనా.

55
అమలు అయితే వృద్ధులకు జ‌రిగే లాభం ఏంటి.?

రాయితీ తిరిగి అమలులోకి వస్తే టికెట్ బుకింగ్ ప్రక్రియలో మార్పు ఉండదు. IRCTC వెబ్‌సైట్, రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఈ రెండింటిలో వయస్సు నమోదు చేస్తే డిస్కౌంట్ ఆటోమేటిక్‌గా వర్తిస్తుంది. పదవీ విరమణ తర్వాత పరిమిత ఆదాయం, పెరుగుతున్న ఖర్చుల మధ్య ఈ ఉపశమనం వృద్ధులకు ఆర్థిక ఊరటను ఇస్తుంది. కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా ప్రయాణించే అవకాశాన్ని కూడా పెంచుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories