కరోనా కారణంగా ఏర్పడిన సంక్షోభాన్ని అధిగమించడానికి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనను మార్చి 2020లో ప్రకటించారు. మొదట్లో ఈ పథకం ఏప్రిల్-జూన్ 2020 కాలానికి ప్రారంభించబడింది, అయితే తర్వాత దానిని నవంబర్ 30 వరకు పొడిగించారు.
కేంద్రపాలిత ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీపై కీలక నిర్ణయం
దీనితో పాటు దాద్రా, నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూలలో విద్యుత్ పంపిణీ వ్యాపారాన్ని ప్రైవేటీకరించడానికి ఒక కంపెనీ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా ఏర్పాటైన కంపెనీ ఈక్విటీ షేర్లను అత్యధిక బిడ్డర్లకు విక్రయించి ఉద్యోగుల బాధ్యతలను తీర్చేందుకు ట్రస్టు ఏర్పాటుకు ఆమోదం లభించింది.