మరో రెండు బ్యాంకుల ప్రైవేటీకరణ.. పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టానున్న బిల్..

First Published Nov 24, 2021, 1:25 PM IST

రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించే(banks privatisation) లక్ష్యంతో ప్రభుత్వం బ్యాంకింగ్ చట్టాల (amendment) బిల్లు 2021ని నవంబర్ 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది.  శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టడానికి షెడ్యూల్ చేసిన 26 బిల్లుల జాబితాలో  ప్రతిపాదిత చట్టం కూడా ఉంది.
 

బిల్లు ఉద్దేశం ప్రకారం రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలంటే బ్యాంకింగ్ కంపెనీల (అక్వైజేషన్ అండ్  ట్రాన్స్ఫర్ ఆఫ్ అండర్ టేకింగ్) చట్టాలు, 1970 అండ్ 1980లో సవరణలు చేయవలసి ఉంటుంది, అలాగే బ్యాంకింగ్‌ రెగులేషన్ చట్టం, 1949లో  సవరణలు చేయవలసి ఉంటుంది. 

అధికారిక వర్గాల ప్రకారం బిల్లు ప్రవేశపెట్టడం, పరిశీలన రాబోయే శీతాకాల సమావేశాల్లో ఆమోదించడం కోసం జాబితా చేసింది.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తున్నప్పుడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.75 లక్షల కోట్లను ఆర్జించేందుకు ప్రభుత్వం చేపట్టిన డిస్ ఇన్వెస్ట్‌మెంట్ డ్రైవ్‌లో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను ప్రకటించారు.

అంతేకాకుండా శీతాకాల సమావేశాల్లో  ప్రవేశపెట్టాల్సిన మరో ముఖ్యమైన బిల్లు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (సవరణ) బిల్లు, 2021 ఉంది.

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ నుండి నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్‌ను వేరు చేయడానికి వీలుగా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) చట్టాన్ని సవరించడం ఈ చట్టం యొక్క ఉద్దేశ్యం.
 

ఈ బిల్లును ప్రవేశపెట్టడం వల్ల యూనివర్సల్ పెన్షన్ కవరేజీని నిర్ధారించడంతోపాటు PFRDAని బలోపేతం చేయడం కోసం 2020 బడ్జెట్ ప్రకటన కూడా నెరవేరుతుంది.

PFRDA చట్టంలో సవరణతో ప్రస్తుతం PFRDA(నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్) రెగ్యులేషన్స్ 2015 కింద నిర్దేశించిన NPS ట్రస్ట్  అధికారాలు, విధులు  ఛారిటబుల్ ట్రస్ట్ లేదా కంపెనీల యాక్ట్ కిందకు రావచ్చని వర్గాలు తెలిపాయి.
 

NPS ట్రస్ట్‌ను పెన్షన్ రెగ్యులేటర్ నుండి వేరుగా ఉంచడం అండ్ 15 మంది సభ్యులతో కూడిన కాంపిటెంట్ బోర్డు ద్వారా నిర్వహించడం దీని వెనుక లక్ష్యం. ఇందులో రాష్ట్రాలతో సహా, కార్పస్‌కు అత్యధికంగా సహకరించినందున మెజారిటీ సభ్యులు ప్రభుత్వానికి చెందినవారు కావచ్చు.

click me!