eAadhaar App: ఇకపై ఇంట్లో ఉండే ఆధార్ అప్‌డేట్స్ చేసుకోవచ్చు: త్వరలో అందుబాటులోకి ఇ-ఆధార్ యాప్

Published : Jun 17, 2025, 09:45 PM IST

eAadhaar App: UIDAI ఇ-ఆధార్ అనే కొత్త మొబైల్ యాప్‌ను ప్రారంభించనుంది. దీని ద్వారా మీ ఆధార్ అప్ డేట్స్ ఈజీగా చేసుకోవచ్చు. ఆధార్ కేంద్రాలను వెళ్లి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండానే అప్ డేట్ చేసుకోవచ్చు. ఈ యాప్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామా?

PREV
15
కొత్త ఆధార్ యాప్

భారతీయ ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI) ఆధార్ సంబంధిత సేవలను మరింత సులభతరం చేయనుంది.  ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు అని చెప్పొచ్చు. ఇ-ఆధార్ అనే ఈ మొబైల్ యాప్ వినియోగదారులు ఏ ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లకుండానే వారి పేరు, ఇంటిపేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ వంటి కీలకమైన సమాచారాన్ని అప్ డేట్ చేసుకోవచ్చు. 

25
UIDAI కొత్త యాప్

త్వరలో విడుదల కానున్న ‘ఇ-ఆధార్’ యాప్‌ను UIDAI చురుగ్గా పరీక్షిస్తోంది. మొత్తం 1 లక్ష యాక్టివ్ పరికరాల్లో, 2,000 ఆధార్ యంత్రాలను కొత్త డిజిటల్ వ్యవస్థతో అనుసంధానించడం ద్వారా ఒక ప్రత్యేక కమిషన్ దాని సాంకేతిక మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తోంది. 

విడుదలైన తర్వాత ఈ యాప్ వినియోగదారులు తమ మొబైల్ పరికరాల నుండి కొన్ని నిమిషాల్లో కీలక సమాచారాన్ని నేరుగా అప్ డేట్ చేసుకొనే వీలు కల్పిస్తారు. 

QR కోడ్ షేరింగ్ ద్వారా ఆధార్ డేటా బదిలీ కూడా చేయొచ్చు. మొబైల్ నుండి మొబైల్, యాప్ నుండి యాప్ వెరిఫికేషన్‌ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. 

35
ఆధార్ కార్డు అప్‌డేషన్ పొడిగింపు

ఈ కీలకమైన డిజిటల్ అప్‌డేట్‌తో పాటు, UIDAI ఉచిత ఆధార్ అప్‌డేట్ గడువును పొడిగించినట్లు ప్రకటించింది. ఎవరైనా ఇప్పుడు తమ పేరు, ఇంటిపేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ లేదా ఫోటోను 14 జూన్ 2026 వరకు ఉచితంగా అప్ డేట్ చేసుకోవచ్చు. ఇది గతంలో ఇచ్చిన గడువు 14 జూన్ 2025 నుండి ఒక సంవత్సరం పొడిగించినట్లు అవుతుంది. 

10 సంవత్సరాల క్రితం ఆధార్‌కు నమోదు చేసుకుని ఆ తర్వాత ఒక్కసారి కూడా తమ సమాచారాన్ని అప్ డేట్ చేసుకోని వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఈ అవకాశాన్ని UIDAI కల్పించింది.

45
ఇ-ఆధార్ యాప్ ఫీచర్లు

అయితే ఆధార్ కార్డులో మార్పులు చేయాలనుకునే వారు కొన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలి. మీ పేరు లేదా ఇంటిపేరును అప్ డేట్ చేసుకోవడానికి మీ హైస్కూల్ మార్క్స్ షీట్, వివాహ ధృవీకరణ పత్రం, ఓటరు ఐడి, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్‌పోర్ట్ వంటి డాక్యుమెంట్లు ఉండాలి. 

మీరు మీ చిరునామాను మార్చాలనుకుంటే బ్యాంక్ పాస్‌బుక్‌లు, విద్యుత్ లేదా వాటర్ బిల్లులు, టెలిఫోన్ బిల్లులు, గ్యాస్ కనెక్షన్ బిల్లులు లేదా రేషన్ కార్డులు ఉండాలి. 

రెంట్‌కి ఉండే వాళ్లయితే చిరునామా రుజువుగా రెంటల్ అగ్రిమెంట్ సమర్పించాలి. 

55
ఆధార్ పేరు మార్పు

ఇంట్లో సెల్ఫ్ సర్వీస్ ఫీచర్లు మరియు రియల్ టైమ్ అప్‌డేట్‌లను ప్రారంభించడం ద్వారా, UIDAI ఆధార్ నిర్వహణను మరింత అందుబాటులోకి, వినియోగదారులకు అనుకూలంగా, సమర్థవంతంగా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మీరు కొత్త ప్రదేశానికి వెళ్లినా మీ మొబైల్ నంబర్‌ను మార్చుకున్నా లేదా మీ వ్యక్తిగత రికార్డులను అప్ డేట్ చేసుకున్నా ఈ యాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories