జియో స్టార్టర్ ప్యాక్ ద్వారా వినియోగదారులకు చాలా ప్రయోజనలే అందుతున్నాయి. వాటిలో ముఖ్యమైన ప్రయోజనాలు గమనిస్తే..
28 రోజుల పాటు అపరిమిత 5G సేవలు: భారతదేశంలో వేగవంతమైన 5G నెట్‌వర్క్‌ను అనుభవించే అవకాశం లభిస్తుంది. మీకు మొబైల్ లో అన్ లిమిటెడ్ కాల్స్, డేటా లభిస్తుంది.
50 రోజుల ఉచిత జియో ఫైబర్ లేదా ఎయిర్‌ఫైబర్ ట్రయల్ కనెక్షన్: జియో స్టార్టర్ ప్యాక్ తో మీకు 50 రోజులు జియో ఫైబర్ సేవలు ఉచితంగా లభిస్తాయి. టీవీ, Wi-Fi, ప్రముఖ OTT యాప్‌లతో ఇంటర్నెట్ ఎంటర్టైన్‌మెంట్‌ను మీకు అందిస్తుంది.
50GB ఉచిత జియో AI క్లౌడ్ స్టోరేజ్: జియో స్టార్టర్ ప్యాక్ తో మీకు డేటా స్టోరేజ్ అవసరాల కోసం ఉచిత క్లౌడ్ ప్లాట్‌ఫాం కూడా అందుబాటులో ఉంటుంది. 50 జీబీ ఉచిత జియో ఏఐ క్లౌడ్ స్టోరేజీ లభిస్తుంది.
90 రోజుల పాటు 4K నాణ్యతలో జియో హాట్‌స్టార్ ఉచితం: జియో స్టార్టర్ ప్యాక్ లో మీకు 90 రోజుల పాటు జియో హాట్ స్టార్ సేవలు ఉచితంగా లభిస్తాయి. జియో హాట్ స్టార్ ను టీవీ లేదా మొబైల్‌లో చూడవచ్చు.
ఈ ప్రయోజనాలను ఒకే ఆఫర్‌లో కలిపి అందించడం ద్వారా, వినియోగదారులకు కొత్త ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే పూర్తి డిజిటల్ యూటిలిటీ అందేలా చేయడమే జియో ఉద్దేశంగా సంస్థ పేర్కొంది.