ట్విట్టర్ కొత్త సి‌ఈ‌ఓగా 37 ఏళ్ల భారతీయుడు.. టాప్ 500 కంపెనీలలో అతిపిన్న వయస్సుగల సి‌ఈ‌ఓ..

First Published Nov 30, 2021, 11:58 AM IST

సోమవారం మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ ఫార్మ్ ట్విట్టర్ సీఈవో పదవికి జాక్ డోర్సే రాజీనామా చేయడంతో భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్‌ ఆ పదవిలో నియమితులయ్యారు. దీంతో ప్రస్తుతం డిజిటల్ ప్రపంచం  భారతీయుల చేతుల్లో మారింది. మరోవైపు విశేషం ఏంటంటే మైక్రోసాఫ్ట్, గూగుల్, అడోబ్, ఐబీఎం ఇతర కంపెనీల సి‌ఈ‌ఓలు భారతీయుల కావడం గమనార్హం. అత్యంత చిన్న వయసులో సి‌ఈ‌ఓగా బాధ్యతలు చేపట్టిన  వారి గురించి తెలుసుకుందాం...

ట్విట్టర్ సి‌ఈ‌ఓ పరాగ్ అగర్వాల్
ప్రపంచంలోని ప్రముఖ సోషల్ మీడియా సైట్‌లలో ఒకటైన ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే తన పదవికి సోమవారం రాజీనామా చేశారు,  జాక్ డోర్సే తరువాత భారతీయ సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ తదుపరి సి‌ఈ‌ఓగా నియమితులయ్యారు. దీనికి ముందు పరాగ్ అగర్వాల్ కంపెనీలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO)గా ఉన్నారు. 2011లో ట్విట్టర్ కంపెనీలో ఇంజనీర్‌గా చేరిన తరువాత అతను సి‌టి‌ఓ  వరకు ప్రయాణించి ఇప్పుడు సి‌ఈ‌ఓ కుర్చీలో చేరారు. అతను ఐ‌ఐ‌టి (IIT) బాంబే నుండి ఇంజనీరింగ్ అండ్ కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి పి‌హెచ్‌డి (PhD) పూర్తి చేశాడు.
 

indian origin parag agarwal becomes twitter CEO to replace jack dorsey

గూగుల్‌ సి‌ఈ‌ఓ సుందర్ పిచాయ్ 
ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజన్ గూగుల్‌ సీఈవో సుందర్ పిచాయ్. సుందర్ పిచాయ్ 2015లో గూగుల్ కంపెనీ సీఈఓగా నియమితులయ్యారు. సుందర్ పిచాయ్ 2004లో గూగుల్‌లో చేరారు. 

మైక్రోసాఫ్ట్‌ సి‌ఈ‌ఓ సత్య నాదెళ్ల
గూగుల్ అలాగే ట్విట్టర్‌తో పాటు సాఫ్ట్‌వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ సి‌ఈ‌ఓ కూడా భారతీయుడే. భారతీయ సంతతికి చెందిన సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓగా కూడా ఉన్నారు. హైదరాబాద్‌లో జన్మించిన నాదెళ్ల 2014లో మైక్రోసాఫ్ట్‌ కంపెనీ సీఈఓగా నియమితులై పదవిలో కొనసాగుతున్నారు.

ఐ‌బి‌ఎం సి‌ఈ‌ఓ అరవింద్ కృష్ణ
ప్రపంచంలోనే పేరుగాంచిన  కంప్యూటర్ హార్డ్‌వేర్ కంపెనీ ఐబీఎం సీఈవో పదవిలో భారత సంతతికి చెందిన అరవింద్ కృష్ణ ఉన్నారు. అరవింద్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లో జన్మించారు అలాగే 2020 సంవత్సరంలో ఐ‌బి‌ఎం కంపెనీకి సి‌ఈ‌ఓగా అయ్యారు. అరవింద్ కృష్ణ ఐఐటి కాన్పూర్ నుండి ఇంజనీరింగ్ పూర్తి చేసారు. 

మరికొంత మంది ప్రముఖులు 
వీరు కాకుండా పెద్ద పెద్ద కంపెనీలలో సి‌ఈ‌ఓలుగా మారి భారతదేశం గర్వించేలా చేస్తున్న భారతీయులు చాలా మంది ఉన్నారు. వీరిలో కాలిఫోర్నియాకు చెందిన అడోబ్ సీఈవో శాంతను నరైన్, వీఎం వేర్ సీఈవో రఘు రఘురామ్ ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలో పరాగ్ అగర్వాల్ పేరు చేరడం ఖచ్చితంగా భారతదేశానికి పెద్ద విజయం.  

click me!