బంగారం చౌకగా కొనుగోలు చేసేందుకు అవకాశం.. ఈ పథకంతో ఎప్పుడు ప్రారంభమవుతుందంటే..?

First Published Nov 29, 2021, 2:28 PM IST

పెట్టుబడిదారులకు బంగారం అత్యుత్తమ పెట్టుబడి సాధనంగా పరిగణించబడుతుంది. ఓ వైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (omicron)వ్యాప్తితో స్టాక్ మార్కెట్‌లో భూకంపం వచ్చి ఇన్వెస్టర్లలో భయానక వాతావరణం నెలకొంది. మరోవైపు బంగారం ధర (gold price)కూడా పెరుగుతోంది. మీరు బంగారంలో పెట్టుబడి(investment) పెట్టాలనుకుంటే, చౌకగా బంగారాన్ని కొనుగోలు చేయడానికి  గొప్ప అవకాశం. 

ఎస్‌జి‌బి ​​పథకం నవంబర్ 29 నుండి ఓపెన్ 
స్టాక్ మార్కెట్ కుప్పకూలిన తర్వాత పెట్టుబడిదారులు మరోసారి బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు, ఎందుకంటే బంగారం పై పెట్టుబడి ఎల్లప్పుడూ సురక్షితమైన పెట్టుబడి ఆప్షన్ గా పరిగణించబడుతుంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.48,466గా ఉంది. కానీ ప్రభుత్వ సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) పథకం 2021-22 కింద మీరు దీన్ని చౌకగా కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించి ఒక నివేదిక ప్రకారం ఈ పథకం నవంబర్ 29 నుండి ఐదు రోజుల పాటు సబ్ స్క్రిప్షన్ కోసం ఓపెన్ అవుతుంది.

గోల్డ్ బాండ్ ఇష్యూ ధర
నివేదిక ప్రకారం, ఎస్‌జి‌బి పథకంలో గోల్డ్ బాండ్ ఇష్యూ ధర గ్రాముకు రూ. 4,791గా నిర్ణయించబడింది. ఈ సమాచారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  తెలిపింది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2021-22- సిరీస్ VIII నవంబర్ 29 నుండి 03 డిసెంబర్ 2021న ముగిసే వరకు సబ్ స్క్రిప్షన్ కోసం ఓపెన్ అవుతుంది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారికి మినహాయింపు
భారత ప్రభుత్వం, ఆర్‌బిఐతో సంప్రదించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి డిజిటల్ మోడ్‌లో దరఖాస్తు కోసం చెల్లింపు చేసే పెట్టుబడిదారులకు విలువపై గ్రాముకు రూ. 50 తగ్గింపు ఇవ్వాలని నిర్ణయించింది. ఇలాంటి పెట్టుబడిదారుల కోసం గోల్డ్ బాండ్ల జారీ ధర గ్రాము బంగారంపై రూ.4,741గా ఉంచబడింది.  

మీరు ఇక్కడ నుండి బంగారు బాండ్లను కొనుగోలు చేయవచ్చు 
భారత ప్రభుత్వం తరపున ఆర్‌బి‌ఐ ఈ బంగారు బాండ్లను జారీ చేస్తుంది. ఈ బాండ్లను బ్యాంకులు (చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, చెల్లింపు బ్యాంకులు మినహా), స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నియమించబడిన పోస్టాఫీసులు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ వంటి గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా విక్రయించబడతాయి. 

 2015లో ఈ పథకం ప్రారంభం
 నవంబర్ 2015లో ఎస్‌బి‌జి పథకాన్ని ప్రారంభించడం గమనార్హం. భౌతిక బంగారం డిమాండ్‌ను తగ్గించడం ఈ పథకం ప్రారంభింభం ముఖ్య లక్ష్యం. సబ్‌స్క్రిప్షన్ వ్యవధికి ముందు వారంలోని చివరి 3 పనిదినాల కోసం ఇండియా బులియన్ & జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ జారీ చేసిన 999 స్వచ్ఛత బంగారం  సాధారణ సగటు ముగింపు ధర ఆధారంగా బాండ్ ధర నిర్ణయించబడుతుంది. 
 

click me!