విదేశీ మార్కెట్‌పై రిలయన్స్ ఇండస్ట్రీస్ కన్ను.. యూ‌కే అతిపెద్ద కంపెనీ కోసం వేలం..

First Published Nov 29, 2021, 6:06 PM IST

ఆసియా అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ(mukesh ambani) ఇప్పుడు విదేశీ మార్కెట్లపై కన్నేశాడు. రిలయన్స్ జియో (reliance jio)ద్వారా ఇప్పటికే దేశ టెలికాం మార్కెట్‌లో జెండాను రెపరెపలాడించాడు. ఇప్పుడు ముఖేష్ అంబానీ కంపెనీ బ్రిటన్‌లోని అతిపెద్ద బిటి గ్రూప్‌(BT group) కోసం వేలం వేయడానికి సిద్ధమవుతోంది. 

ఒక నివేదిక ప్రకారం విదేశాల్లో   భారతీయ కంపెనీ చేసిన అతిపెద్ద M&M డీల్ ఇదే. 

టి-మొబైల్ (T-Mobile)
బ్రిటీష్ టెలికాం అని పిలువబడే  బిటి (BT)గ్రూప్  కోసం బిడ్ చేయనుంది. బిటి   గ్రూప్ టేలికాం రంగంలో అతిపెద్ద కంపెనీలలో ఒకటి. కొంతకాలం క్రితం రిలయన్స్ T-Mobile డచ్ యూనిట్‌ను కొనుగోలు చేయడానికి బిడ్‌ను వేసింది. అంతేకాకుండా ఇటీవలి నివేదిక ప్రకారం ముఖేష్ అంబానీ లండన్‌లోని ఐకానిక్ స్టోక్ పార్క్‌ను కొనుగోలు చేశారు, ఈ డీల్ 57 మిలియన్ పౌండ్లకు పూర్తయింది. ఇప్పుడు రిలయన్స్ అండ్ బిటిల ఒప్పందంపై వార్తలు చర్చనీయాంశమయ్యాయి. 

ప్రారంభ దశలో
రిలయన్స్  ఈ ప్రణాళికకు సంబంధించి ప్రారంభ చర్చలు ఇప్పుడే ప్రారంభమయ్యాయని ముగింపుకు చేరుకోవడానికి సమయం పడుతుందని చర్చల నివేదిక సోర్సెస్ కి ఉటంకిస్తూ పేర్కొంది. బిటి గ్రూప్ సిఇఒ ఫిలిప్ జాన్సన్ లేదా ఇతర ఉన్నతాధికారులతో ముఖేష్ అంబానీ చర్చించారా  లేదా అనేది కూడా తెలియరాలేదు. బి‌టి అనేది యూ‌కేలో ఫిక్స్‌డ్ లైన్ టెలికాం సర్వీస్ ఆపరేటర్. బి‌టి  గ్రూప్ $21 బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉంది అలాగే దాని వ్యాపారం 170 దేశాలలో విస్తరించి ఉంది. 

బి‌టి అనేది ఫిక్స్‌డ్ లైన్ టెలికాం సేవల యూ‌కే  ఆపరేటర్. గత కొన్ని సంవత్సరాలుగా ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్, ఐ‌పి టి‌వి, టెలివిజన్, స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్, మొబైల్ సేవలను అందిస్తుంది, అలాగే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 170 దేశాలకు అందిస్తుంది. బి‌టి స్టాక్ ఐదేళ్లలో 53% పడిపోయింది, 2020-21లో 11 సంవత్సరాల కనిష్టానికి చేరుకుంది.

click me!