1984లో అతని తండ్రి రామ్ గోపాల్ ముంబైలో పనిచేసేవాడు, కానీ అతను తన భార్యను డెలివరీ కోసం అజ్మీర్‌లోని తన తల్లిదండ్రుల వద్దకు పంపాడు. ఆ సమయంలో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డెలివరీ చేయించే అంతా స్థోమత అతనికి లేదు. కానీ నేడు పరాగ్ అగర్వాల్ ప్రపంచంలోని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన ట్విట్టర్‌కి సిఈఓ అయిన తరువాత అతని కృషి, త్యాగం ఫలించింది.
పరాగ్ అగర్వాల్ తల్లిదండ్రులు రామ్ గోపాల్, శశి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. డిసెంబర్ 4న ఆయన అజ్మీర్‌కు వస్తారని, అక్కడ ఆయనకు సన్మానం జరుగుతుందని విశ్వసిస్తున్నారు. నగరంలోని రద్దీగా ఉండే ధన్‌మండి, ప్రసిద్ధ దర్గా నుండి కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్న ఖజానా గలిలో పరాగ్ అగర్వాల్ తాతయ్యలు అద్దె ఇంట్లో నివసించారని పరాగ్ అగర్వాల్ కుటుంబానికి చెందిన సన్నిహితులు తెలిపారు. మరోవైపు తండ్రి రామ్ గోపాల్ పని నిమిత్తం ముంబైకి రావాల్సి వచ్చింది.