ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాలు: పారిస్, సింగపూర్ని మించి అత్యంత కాస్ట్లీ నగరంగా ఇజ్రాయెల్

First Published Dec 1, 2021, 3:09 PM IST

లండన్‌లోని ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల జాబితాను విడుదల చేసింది. ఈసారి ఈ జాబితాలో పారిస్ అలాగే సింగపూర్‌(singapore)కు మొదటి స్థానం లభించలేదు. అయితే సర్వే ప్రకారం ఇజ్రాయెల్ (israil)నగరమైన టెల్ అవీవ్( Tel Aviv) ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా నిలిచింది. 
 

ఇజ్రాయెల్ నగరం గత సంవత్సరం ఐదవ స్థానం నుండి ప్రపంచవ్యాప్త కాస్ట్ ఆఫ్ లివింగ్  2021 నివేదికలో మొదటి సారి అగ్రస్థానానికి చేరుకుంది. అలాగే పారిస్‌ను సింగపూర్‌ని రెండవ స్థానానికి నెట్టివేసింది. జ్యూరిచ్ అండ్ హాంకాంగ్ మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి.

EIU ప్రకారం, టెల్ అవీవ్ అగ్రస్థానంలో ఉండటానికి కిరాణా, రవాణాతో సహా వస్తువుల ధరలు పెంపు, షెకెల్(shekel)పెరుగుదల ప్రధాన కారకాలు. షెకెల్ అనేది ఇస్రాయల్ కరెన్సీ . 1 ఇస్రాయల్ షెకెల్ భారతియ రూ.23లతో సమానం.

నగరాల్లో అధ్యయనం చేసిన వస్తువులు, సేవల ధరలు స్థానిక కరెన్సీ పరంగా సంవత్సరానికి 3.5% పెరిగాయని, గత ఏడాది 1.9%తో పోల్చిచూసినట్లు పేర్కొంది. ద్రవ్యోల్బణం రేటు గత ఐదేళ్లలో అత్యంత వేగంగా నమోదైంది. అధిక చమురు ధరలు అన్‌లెడెడ్ పెట్రోల్ ధరను 21% పెంచడంతో రవాణా ఖర్చులు ఎక్కువగా పెరిగాయి.


టెల్ అవీవ్ జాతీయ కరెన్సీ డాలర్‌తో పోలిస్తే షెకెల్ బలపడటంతో రవాణా, కిరాణా వస్తువుల ధరల పెరుగుదల నేపథ్యంలో టెల్ అవీవ్ ర్యాంకింగ్స్‌లో అత్యంత ఖరీదైన నగరంగా మారింది . ఈ సంవత్సరం డేటా ఆగస్టు ఇంకా సెప్టెంబర్‌లలో సేకరించబడింది.

పారిస్ అండ్ సింగపూర్ రెండవ స్థానంలో నిలిచాయి.
పారిస్, సింగపూర్ రెండు కలిపి రెండవ స్థానంలో నిలిచాయి , జ్యూరిచ్ అండ్ హాంకాంగ్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. న్యూయార్క్ ఆరో స్థానంలో ఉండగా, జెనీవా ఏడో స్థానంలో ఉంది. మొదటి 10 స్థానాల్లో కోపెన్‌హాగన్ ఎనిమిదో స్థానంలో, లాస్ ఏంజెల్స్ తొమ్మిదో స్థానంలో, జపాన్‌కు చెందిన ఒసాకా 10వ స్థానంలో నిలిచాయి.
 

గతేడాది మొదటి స్థానంలో
గతేడాది 2020లో పారిస్, జ్యూరిచ్, హాంకాంగ్ సర్వేలో మొదటి స్థానంలో నిలిచాయి. ఈ మూడు నగరాల్లో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుంది.

అధ్యయనంలో ఇతర కీలక ఫలితాలు:

రోమ్ 32వ స్థానం నుండి 48వ స్థానానికి ర్యాంకింగ్‌లో అతిపెద్ద పతనాన్ని చూసింది

 టెహ్రాన్ 79వ స్థానం నుండి 29వ స్థానానికి చేరుకుంది.

హాంకాంగ్‌లో అత్యంత ఖరీదైనదిగా పెట్రోల్ ధర లీటరుకు 2.50 డాలర్లు అంటే సుమార్ రూ.187

బ్రాండెడ్ సిగరెట్ ధరలు సగటున 6.7% పెరిగాయి

సిరియా రాజధాని డమాస్కస్ ప్రపంచంలోనే అత్యంత చౌకైన నగరంగా కొనసాగుతోంది

EIUలో వరల్డ్ వైడ్ కాస్ట్ ఒఫ్ లివింగ్ హెడ్  ఉపాసనా దత్ ఒక ప్రకటనలో  “COVID-19 వ్యాక్సిన్‌లు వచ్చిన తరువాత  ప్రపంచవ్యాప్తంగా చాలా ఆర్థిక వ్యవస్థలు ఇప్పుడు కోలుకుంటున్నప్పటికీ, చాలా ప్రముఖ నగరాలలో ఇప్పటికీ కరోనా కేసుల పెరుగుదలను చూస్తున్నాయి. దీంతో సరుకుల సరఫరాకు అంతరాయం ఏర్పడి కొరత కారణంగా అధిక ధరలకు దారితీసింది అని అన్నారు.

"రాబోయే సంవత్సరంలో అనేక రంగాలలో వేతనాలు పెరగడం వలన అన్నీ నగరాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్  మరింత పెరగవచ్చు అని  మేము భావిస్తున్నాము. అయినప్పటికీ, ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను జాగ్రత్తగా పెంచాలని కూడా మేము ఆశిస్తున్నాము.  

వరల్డ్‌వైడ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది 173 నగరాల్లోని 200 ఉత్పత్తులు, సర్వీసెస్ విడివిడి ధరలను పోల్చి EIU ద్వారా ఒక సంవత్సరంలో  రెండుసార్లు నిర్వహించబడే సర్వే.

టాప్ 10 అత్యంత ఖరీదైన నగరాలు:

1 టెల్ అవివ్

2 పారిస్ (సెకండ్)

2 సింగపూర్ (సెకండ్)

4 జ్యూరిచ్

5 హాంగ్ కాంగ్

6 న్యూయార్క్

7 జెనీవా

8 కోపెన్‌హాగన్

9 లాస్ ఏంజిల్స్

10 ఒసాకా

click me!