ప్రభుత్వం కీలక నిర్ణయంతో దిగోచ్చిన ఇంధన ధరలు.. పెట్రోల్ ధర రూ.8 తగ్గింపు..

First Published Dec 1, 2021, 12:58 PM IST

 దేశవ్యాప్తంగా నేడు 1 డిసెంబర్  2021 బుధవారం రోజున పెట్రోల్(petrol), డీజిల్ (diesel)ధరలలో ఎటువంటి మార్పు లేదు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు(fuel prices) గణనీయంగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMC) దేశీయ ఇంధన ధరలలో స్థిరత్వాన్ని కొనసాగించాయి. 

యూ‌ఎస్ బెంచ్‌మార్క్, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ బ్యారెల్‌కు 70 డాలర్ల దిగువకు పడిపోయింది, అంటే ఏప్రిల్ 2020 తర్వాత అతిపెద్ద క్షీణతను సూచిస్తుంది. అదేవిధంగా,బ్రెంట్ క్రూడ్ ధర కూడా బ్యారెల్‌కు 72 డాలర్లకి పడిపోయింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో జాతీయ స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు డిసెంబర్ 1న స్థిరంగా ఉన్నాయి, ఇంధన ధరలలో చివరి సవరణ తర్వాత వరుసగా 27వ రోజు  పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు.

ఇంధనాలపై ఎక్సైజ్ సుంకం తగ్గింపును కేంద్రం ప్రకటించిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు చివరిసారిగా నవంబర్ 4న సవరించింది, దీంతో ఇంధన ధరల నుండి ఆల్ టైమ్  హై నుండి ఉపశమనం కలిగించింది.
 

దేశంలోని అతిపెద్ద ఇంధన రిటైలర్ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకారం ఢిల్లీలో పెట్రోల్ లీటరుకు రూ. 103.97గా ఉంది, అయితే దేశ రాజధానిలో లీటర్ డీజిల్ ధర రూ. 86.67గా ఉంది.

భారతదేశ ఆర్థిక కేంద్రమైన ముంబైలో పెట్రోల్ లీటరుకు రూ. 109.98కి అందుబాటులో ఉంది. ప్రజలు ఒక లీటర్ డీజిల్‌కు రూ. 94.14 చెల్లించాల్సి ఉంటుంది. అయితే నాలుగు ప్రముఖ మెట్రో నగరాల్లో ముంబైలోని పెట్రోల్ ధర అత్యధికంగా ఉంది.

అదే విధంగా తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.56గా ఉండగా, డీజిల్ ధర రూ.91.58గా కొనసాగుతోంది.కోల్‌కతాలో పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేకుండా ఉన్నాయి. దీంతో పెట్రోల్ ధర రూ.104.67, డీజిల్ ధర రూ.89.79గా ఉన్నాయి.
 

ఇంధన ధరలను ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి OMCలు గత 15 రోజుల అంతర్జాతీయ ధరలు, విదేశీ స్టాక్ ఎక్స్ఛేంజీల ఆధారంగా సవరించాయి. అయితే దేశీయ మార్కెట్‌లో వాల్యు ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు వంటి స్థానిక పన్నులతో సహా వివిధ అంశాల ఆధారంగా పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి.

ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని వసూలు చేస్తుంది. ముఖ్యంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలను అప్‌డేట్ చేస్తాయి.
 

దేశ రాజధాని ఢిల్లీలో నేడు పెట్రోల్ ధరలు తగ్గాయి. ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం పెట్రోల్‌పై వ్యాట్‌ను తగ్గించింది, ఈ కారణంగా పెట్రోల్ ధర దిగోచ్చింది. విశేషమేమిటంటే ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.8 తగ్గింది. దీంతో ప్రజలకు నేడు గొప్ప ఉపశమనం లభించింది.

ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.8 తగ్గిన తర్వాత.. ఇప్పుడు దేశ రాజధానిలో పెట్రోల్ ధర రూ.100 దిగువకు చేరింది. ఢిల్లీ ప్రభుత్వం ఇంధన ధరలపై  ఎక్సైజ్ సుంకాన్ని ఐదు, పది రూపాయలు తగ్గించింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత తగ్గాయి. కేంద్రం నిర్ణయం తర్వాత ఎన్‌డి‌ఏ పాలిత రాష్ట్రాలు కూడా తమ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాయి. కొద్ది రోజుల క్రితం పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుని ప్రజలకు ఊరటనిచ్చింది.
 

రికార్డు స్థాయిలో పెట్రోల్ ధర
గత కొంత కాలంగా దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ముంబై వరకు పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో విపక్షాలన్నీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. లాక్ డౌన్ సమయం నుండి పెట్రోల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అయితే తాజాగా ఇంధన ధరల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై వ్యాట్‌ను తగ్గించింది. ఆ తర్వాత చాలా రాష్ట్రాలు కూడా పెట్రోల్ ధరలను తగ్గించాయి. తాజాగా నేడు ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం కూడా పెట్రోల్‌పై వ్యాట్‌ని తగ్గించింది.  

click me!