TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు ఇంత తక్కువా? భారీ డిస్కౌంట్స్ ప్రకటించిన TVS

First Published | Oct 5, 2024, 8:48 PM IST

బండి కొనుక్కోవాలంటే సరైన టైం ఇదే. దసరా పండగ సందర్భంగా భారీ డిస్కౌంట్లతో అనేక కంపెనీల స్కూటర్లు, బైకులు మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. వీటిలో TVS కంపెనీకి చెందిన iQube ఎలక్ట్రిక్ స్కూటర్లు భారీ డిస్కౌంట్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్లు రూ.27 వేలకు పైగా తగ్గింపుతో లభిస్తున్నాయి. ఈ ఆఫర్ ను ఎలా సొంతం చేసుకోవాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. 
 

TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రస్తుతం పండగ ఆఫర్లతో రూ.27,000 వరకు తగ్గింపుతో లభిస్తున్నాయి. ఈ ఆఫర్‌లో క్యాష్‌బ్యాక్, క్రెడిట్ కార్డ్ ఆఫర్‌లు, పొడిగించిన వారంటీలు కూడా ఉన్నాయి.

TVS iQube ఆఫర్లు

భారతీయ మార్కెట్లో అత్యంత విజయవంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో TVS iQube స్కూటర్ ఒకటి. ఇది క్యాష్‌బ్యాక్, క్రెడిట్ కార్డ్ మొదలైన ఆఫర్‌లతో వస్తుంది. TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు పండగ ఆఫర్లతో భారతదేశం అంతటా అందుబాటులో ఉంది. TVS కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆఫర్లు రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి. 
 

TVS iQube 2.2kWh బ్యాటరీ ప్యాక్‌తో రూ. 17,300 క్యాష్‌బ్యాక్‌తో లభిస్తుంది.
నిర్దిష్ట బ్యాంక్ కార్డ్‌లపై రూ.7,700 అదనపు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. 

TVS iQube 3.4 kWh బ్యాటరీతో iQubeని ఎంచుకుంటే ఫ్లాట్ రూ.20,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభిస్తోంది. 
కొనుగోలుదారులు నిర్దిష్ట బ్యాంకు కార్డులను స్వైప్ చేయడం ద్వారా అదనంగా రూ.10,000 ఆదా చేసుకోవచ్చు. 

TVS iQube S మోడల్ ని మీరు ఎంచుకుంటే కంపెనీ ఉచిత పొడిగించిన వారంటీని కూడా అందిస్తోంది. 
దసరా పండగ సందర్భంగా కొత్త TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ఆఫర్లు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ ఆఫర్లు అక్టోబర్ 31, 2024 వరకు వర్తిస్తాయి. 


TVS iQube EV స్కూటర్ల ధరలు

TVS ఈ ఆఫర్లు  2.2kWh బ్యాటరీతో 75 km ప్రయాణించవచ్చు. దీని మాక్సిమం స్పీడ్ 75 kmph. రెండు గంటల్లో బ్యాటరీని 0-80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఈ బండి స్టార్టింగ్ ధర రూ.89,999. 
TVS iQube 3.4kWh బ్యాటరీ మోడల్ గరిష్ట వేగం 100 కి.మీ. ఇది నాలుగు గంటల్లో 0-80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. దీని ధర రూ.1,26,628.
TVS iQube s 3.4kWh బ్యాటరీ మోడల్ గరిష్ట వేగం 100 కి.మీ. ఇది నాలుగు గంటల్లో 0-80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. దీని ధర రూ.1,44,420.
TVS iQube st 3.4kWh బ్యాటరీ మోడల్ గరిష్ట వేగం 100 కి.మీ. ఇది మూడు గంటల్లో 0-80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. దీని ధర రూ.1,55,555.

ప్రభుత్వ చొరవకు టీవీఎస్ ప్రోత్సాహం

పెరిగిన మార్కెట్ కు అనుగుణంగా సరసమైన ఎలక్ట్రిక్ వాహనాలను (EV) ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వ చొరవకు అనుగుణంగా TVS మోటార్ దాని iQube EV శ్రేణిపై గణనీయమైన తగ్గింపులను అందిస్తోంది. అధికారిక TVS మోటార్స్ వెబ్‌సైట్ ప్రకారం TVS iCube SD 5.1 kWh మినహా, కొత్త PM E-డ్రైవ్ చొరవ కింద TVS iCube అన్ని మోడళ్ల అసలు ధరల్లో రూ.10,000 తగ్గింపు  వస్తుంది. ఎంట్రీ-లెవల్ 2.2 kWh వేరియంట్ మొత్తం రూ. 27,300 తగ్గింపుతో అందుబాటులో ఉంది.

ఇతర డిస్కౌంట్ ఆఫర్లు

TVS iQube స్కూటర్లపై రూ.17,300 క్యాష్‌బ్యాక్ ఉంది. 3.4 kWh, S 3.4 kWh వేరియంట్‌ల ధరలపై రూ. 10,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఇచ్చారు. వీటితో పాటు 5 సంవత్సరాలు లేదా 70,000 కి.మీ. పొడిగించిన వారంటీ ఇస్తున్నారు. దీని విలువ సుమారు రూ. 5,999. SD 3.4 kWh మోడల్ పై ప్రత్యేకంగా రూ. 10,000 PM E-డ్రైవ్ ప్రోత్సాహంతో అందుతుంది. ఇది కాకుండా TVS మోటార్ HDFC, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్‌లతో కలిపి రూ. 7,500, రూ. 10,000 వరకు తగ్గింపులను అందిస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఇంత భారీగా డిస్కౌంట్లు రావడం చాలా అరుదు. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కోవాలనుకున్న వారికి ఇదే మంచి సమయం. 

Latest Videos

click me!