ముకేశ్ అంబానీ వంట మనిషికి ఎంత జీతం ఇస్తున్నాడో తెలుసా?

First Published | Oct 5, 2024, 4:44 PM IST

రిలయన్స్ వ్యవస్థాపకుడు ముకేశ్ అంబానీ ఎంత లగ్జరీ లైఫ్ ను గడుపుతాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ముఖేష్ అంబానీ ఇంట్లో వంటచేసే వ్యక్తికి ఎంత జీతం ఇస్తున్నాడో మాత్రం చాలా మందికి తెలియదు. 

రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు, ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ సక్సెస్ వ్యాపారవేత్త. ఈయనుకు ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి. అలాగే కాస్ట్లీ కాస్ట్లీ  ఆభరణాలు, దుస్తులతో అంబానీ ఫ్యామిలీ ఎంతటి లగ్జరీ లైఫ్ ను గడుపుతుందో తెలిసిందే. మీకు తెలుసా? అంబానీ ఫ్యామిలీ కఠినమైన ఆహారాన్ని అనుసరిస్తారు. 

అంబానీ ఇంట్లో ఉద్యోగులకు కూడా లక్షల జీతం సంపాదిస్తున్నారనే విషయం మనలో చాలా మందికి తెలుసు. అయితే అంబానీ లగ్జరీ హోమ్ అంటిలియా చెఫ్ ప్రతి నెలా ఎంత సంపాదిస్తారనే విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఆ సీక్రేట్ ను మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

ముకేశ్ అంబానీకి చెందిన అంటిలియా హౌస్ లో వంట మనిషి నెలకు 2 లక్షల రూపాయల జీతం అందుకుంటాడు తెలుసా? అంటే ఈయన వార్షికాదాయం ఏకంగా రూ.24 లక్షలు. ఈ జీతమే కాదు పరిహార ప్యాకేజీలో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉందట. వంట చేసే వ్యక్తి కుటుంబానికి విద్యా సహాయం వంటి ఎన్నో ప్రయోజనాలను కూడా పొందుతాడు. 

ముఖేష్ అంబానీ చాలా సింపుల్ భోజనం చేస్తారు. ఈయన పప్పు, రోటీ, అన్నం వంటి సింపుల్ ఫుడ్స్ ను ఇష్టంగా తింటారు. అంతేకాదు థాయ్ వంటలంటే కూడా ఈయనకు చాలా ఇష్టం. ముఖేష్ అంబానీ ప్రతి ఆదివారం ఇడ్లీ-సాంబార్ ను తింటానని ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారు. పప్డీ చాట్, చెవ్ పూరీ వంటి స్నాక్స్ ను కూడా అంబానీ ఇష్టంగా తింటారట. 


ముఖేష్ అంబానీ గుజరాతీ వంటకాన్ని బాగా ఇష్టంగా తింటారు. అంతేకాదు ఈ ధనవంతుడు ముంబైలోని స్వాతి స్నాక్స్ వంటి ఫేమస్ ప్లేస్ లో కూడా ఆర్డర్ చేసి తింటుంటారట. అంబానీ కుటుంబ సభ్యులు ప్రత్యేక సందర్భాల్లో.. తమ వంట బృందం తయారు చేసిన భారతీయ, అంతర్జాతీయ వంటకాలను ఆస్వాధిస్తారట.

ఎంత బిజీగా ఉన్నా.. ముఖేష్ అంబానీ ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిసి డిన్నర్ చేస్తారని నీతా అంబానీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.అంబానీ ఫ్యామిలీలో కుటుంబ ఆహారం పట్ల ఈ నిబద్ధత వారి దినచర్యలో ఒక ముఖ్యమైన అంశం. ఐక్యతకు వారు ఇచ్చే విలువకు ఇది. 

అంటిలియాలోని వంటవాడు మాత్రమే లక్షలు సంపాదించడం లేదు. అంబానీ ఇంటి డ్రైవర్ కూడా నెలకు రూ.2 లక్షలు సంపాదిస్తున్నాడు. అలాగే అంటిలియాలో పనిచేసే చాలా మంది ఉద్యోగులు లక్షల్లో జీతాలు పొందుతున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

బకింగ్ హామ్ ప్యాలెస్ తర్వాత ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ హౌస్ గా పేరొందిన అంటిలియా ముంబైలోని కుంబల్లా హిల్ లోని ఆల్టామౌంట్ రోడ్డులో ఉంది. 27 అంతస్తుల్లో,  570 అడుగుల ఎత్తు, 400,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో  ఈ ఖరీదైన హౌస్ ఉంది.

అంబానీ హౌస్ లో మినీ థియేటర్, తొమ్మిది పెద్ద ఎలివేటర్లు, స్విమ్మింగ్ పూల్, హెలిప్యాడ్లు, వందకు పైగా కార్ల పార్కింగ్ స్థలం కూడా ఉంది. మీకు తెలుసా? ఈ ఇంటిని కట్టడానికి 4 సంవత్సరాలు పట్టిందట. ఈ ఇంటి నిర్మాణానికి రూ.15,000 కోట్లు ఖర్చయినట్టు సమాచారం. అంబానీ అంటిలియా ఇంట్లో సుమారు 600 మంది పనిచేస్తున్నట్టు సమాచారం. వీరు లక్షల్లో జీతం పొందుతున్నారని సమాచారం. 

Latest Videos

click me!