రూ.లక్ష డిపాజిట్ చేస్తే రూ.50 వేలు వడ్డీ: ఎక్కడో తెలుసా?

First Published | Oct 5, 2024, 1:45 PM IST

వడ్డీ ఎక్కువ వచ్చే చోట డబ్బులు పెట్టుబడి పెట్టడానికి ఎవరైనా ఇష్టపడతారు. అంతేకదా. బ్యాంకులైతే మాక్సిమం 7 శాతం నుంచి 8.5 శాతం వరకు వడ్డీరేటు ఇస్తాయి. అయితే మీరు కనుక ఇక్కడ డిపాజిట్ చేస్తే భారీగా వడ్డీ సంపాదించవచ్చు. మీరు పెట్టిన పెట్టుబడికి సగం డబ్బును వడ్డీ రూపంలో పొందవచ్చు. డబ్బులు ఎక్కడ డిపాజిట్ చేయాలి. వడ్డీ రేటు ఎలా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనం పూర్తిగా చదవండి. 
 

 ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో పోస్టాఫీసులను ఉన్న దేశం భారతదేశం. ఇది లెటర్స్ డెలివరీ చేయడం, మనీ ఆర్డర్‌ల ద్వారా డబ్బు పంపడం, చిన్న పొదుపు పథకాల కింద డిపాజిట్లను స్వీకరించడం, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (PLI), రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (RPLI) కింద జీవిత బీమా కవరేజీని అందించడం, రిటైల్ సేవలను అందించడం వంటి సేవలను ప్రజలకు అందిస్తోంది. 

1766లో ఇండియాలో పోస్టల్ సర్వీస్‌ను ప్రారంభించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో వారెన్ హేస్టింగ్స్ ఈ పోస్టాఫీసుల ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. ఇది మొదట్లో "కంపెనీ మెయిల్" పేరుతో ఉండేది. ప్రస్తుతానికి దేశం మొత్తం మీద 164,972 పోస్టాఫీసులున్నాయి. ఇండియా పోస్ట్ ప్రపంచంలోనే అత్యంత విశాలమైన పోస్టల్ నెట్‌వర్క్ గా రికార్డుల్లోకెక్కింది. 

1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు పోస్టాఫీసుల సంఖ్య 23,344 మాత్రమే ఉండేది. ఇవి ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. 2016 లో ఈ సంఖ్య 155,015కి పెరిగింది. వీటిలో 90% గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.

21 నవంబర్ 1947న దేశంలో మొదటి కొత్త స్టాంపును విడుదల చేశారు. ఈ స్టాంపు విలువ మూడున్నర అణాలు. 1948 ఆగస్టు 15న స్వాతంత్య్ర ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ స్మారక చిహ్నాన్ని విడుదల చేశారు. 
 

పోస్టాఫీసులో FD ఎలా చేయాలంటే..

మీరు కొంత డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్‌ చేయాలనుకుంటున్నారా? ఎక్కడ డబ్బు పెడితే అత్యధిక వడ్డీ రేటు వస్తుందో అని వెతుకుతున్నారా? అలా అయితే బ్యాంకుల కంటే అత్యధిక వడ్డీ రేటు పొందేది పోస్టాఫీసులో  మాత్రమే. కొన్ని సహకార సంస్థలు అధిక వడ్డీని అందిస్తున్నప్పటికీ వాటిలో పెట్టుబడి పెట్టడం కూడా చాలా రిస్క్ వ్యవహారం. మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సంస్థలు ఎప్పుడు ఆఫీసులు, బిల్డింగులు ఖాళీ చేస్తాయో చెప్పడం కష్టం. కాబట్టి మీ డబ్బును సురక్షితంగా ఉంచడానికి, అధిక వడ్డీని సంపాదించడానికి పోస్టాఫీసు కంటే మెరుగైన చోటు లేదనడంలో అతిశయోక్తి లేదు.

పోస్టాఫీసులో అనేక స్కీమ్ లు ఉన్నాయి. వాటిల్లో బెస్ట్ పథకాల్లో ఒకదాని గురించి ఇక్కడ తెలుసుకుందాం. మీరు పోస్టాఫీసులో ఒక సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల వరకు FD చేస్తే అధిక వడ్డీ పొందవచ్చు. ఇది ఆదాయపు పన్ను చట్టంలోని 80C కిందకు వస్తుంది. దీంతో మీరు కట్టిన అమౌంట్ కు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. 
 


పోస్టాఫీసులో సంవత్సరానికి డిపాజిట్లు ఎలా

మీరు పోస్టాఫీసులో 1 సంవత్సరానికి కొంత అమౌంట్ ఫిక్సడ్ డిపాజిట్ చేస్తే 6.90%, రెండేళ్లకు 7%, మూడేళ్లకు 7.10%, ఐదేళ్లకు 7.50% వడ్డీని పొందవచ్చు. ఈ లెక్క ప్రకారం ఐదేళ్ల పాటు పెట్టుబడి పెట్టడం వల్ల మీకు అత్యధిక వడ్డీ రేటు 7.5% లభిస్తుంది. అంటే రూ.లక్షను ఐదేళ్లపాటు ఎఫ్‌డీలో ఉంచితే మీరు రూ.లక్షతో పాటు రూ.44,995 అదనంగా పొందుతారు. ఐదేళ్లపాటు ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే రూ.2,26,647 వడ్డీ లభిస్తుంది. అంటే మీరు ఐదు సంవత్సరాలకు మొత్తం రూ.7,26,647 పొందుతారు. 
 

పోస్టాఫీసులో మూడేళ్లు, ఐదేళ్లకు డిపాజిట్లు ఇలా..

అదే మీకు రూ. 5 లక్షలు ఉంచడం కష్టమైతే, మీరు రూ. 1 లక్ష ఎఫ్‌డిని మూడేళ్లపాటు ఉంచినట్లయితే మీకు మొత్తం రూ.1,23,661 వస్తాయి. 5 సంవత్సరాలకు మీకు రూ.1,45,329 లభిస్తుంది. మీరు రెండు లక్షల రూపాయలు పెడితే మూడేళ్లకు రూ.2,47,322 సంపాదించవచ్చు. ఐదేళ్లకు రూ.2,90,659 లభిస్తుంది. 

మీరు రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే మూడేళ్లలో రూ.6,18,304, ఐదేళ్లలో రూ.7,26,647 పొందుతారు. మీరు మరింత ఎక్కువ డబ్బు అంటే రూ.10 లక్షలు డిపాజిట్ చేస్తే ఐదేళ్లలో రూ.14,53,294 వస్తుంది. ఇలాంటి ఎన్నో పథకాలు భారతీయ పోస్టల్ డిపార్ట్ మెంట్ లో ఉన్నాయి. 
 

Latest Videos

click me!