H1b Visa: వీసా ఫీజు పెంచడం వల్ల ఈ పెద్ద పెద్ద కంపెనీలకు ట్రంప్ చావు దెబ్బ కొట్టినట్టే

Published : Sep 22, 2025, 12:36 PM IST

H1B వీసాల ఫీజును పెంచారు ట్రంప్. దీనివల్ల కొన్ని టెక్నాలజీ కంపెనీలు ఎక్కువగా నష్టపోతాయి. జూన్ 2025 నాటికి, అమెజాన్‌లో 10,044 మంది ఉద్యోగులు H-1B వీసాలపై ఉన్నారు.  ఇక టీసీఎస్ నుంచి అమెరికాలో పనిచేస్తున్న విదేశీయుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. 

PREV
14
H1b వీసా ఫీజు పెంచి

ట్రంప్ తీసుకున్న ఒక్క నిర్ణయం టెక్ కంపెనీలను అతలాకుతలం చేశాయి. ఇకపై అమెరికాకు తమన ఇతర దేశాల ఉద్యోగులను పంపించడం వీరికి కష్టతరంగా మారుతుంది.  ఇప్పటి నుంచి ఎవరైనా కూడా   H-1B వీసాపై అమెరికా వెళ్లాలంటే రూ.88 లక్షల  రుసుము కట్టాలని నియమం విధించారు. ఇది విదేశీ కంపెనీలతో పాటూ కొన్ని అమెరికన్ కంపెనీలకు షాక్ తగిలింది. 

24
ఈ కంపెనీలకు కష్టమే

వీసా ఫీజులు పెరగడంతో  అమెజాన్, ఐబీఎం, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి టెక్ కంపెనీలు తీవ్రంగా ప్రభావితం  అవుతాయి. పెరిగిన వీసా రుసుము  భారం ఐటీ రంగంలోని ఈ టాప్ కంపెనీలపై ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కంపెనీ తరపున ఉద్యోగులను అమెరికా పంపేదే ఎక్కువగా ఈ ఉద్యోగులే. ముఖ్యంగా అమెజాన్, టీసీఎస్ నుంచి అమెరికా వెళుతున్న H-1B ఉద్యోగులు అధికంగా ఉన్నారు. ఇకపై వీరు ఎక్కువ మంది అమెరికా పంపించలేరు.

34
అమెరికన్ ఉద్యోగులను పెంచేందుకు

టాప్ కంపెనీలు అమెరికన్ ఉద్యోగులను తొలగించి H-1B నియామకాలను పెంచాయని ట్రంప్ ఆరోపిస్తూనే ఉన్నారు.  ఐటీ కంపెనీలు H-1B వ్యవస్థను దుర్వినియోగం చేసి అమెరికన్ కార్మికులకు హాని చేస్తున్నాయని ట్రంప్ చాలాసార్లు అన్నారు. ఇప్పుడు ఈ వీసాపై వచ్చే విదేశీ ఉద్యోగుల సంఖ్య తగ్గుతుందని ట్రంప్ భావిస్తున్నారు.

44
తక్కువ జీతానికే వస్తారని

H-1B వీసాలపై విదేశీయులను అమెరికాకు ఎందుకు కంపెనీలు తీసుకువస్తాయో తెలుసా? వీరు చాలా తక్కువ ధరకే పనిచేశారు. అమెరికన్లతో పోలిస్తే వీరికిచ్చే జీతం 36 శాతం తక్కువగా ఉంటుంది. అందుకే కంపెనీలు అమెరికన్లను తొలగించి, తక్కువ జీతానికి విదేశీయులకు ఉద్యోగాలు ఇస్తున్నాయి. ఇది అమెరికన్ల జీతాలనే కాదు ఉద్యోగ అవకాశాలను కూడా దెబ్బతీస్తోందని ట్రంప్ భావిస్తున్నాడు..

Read more Photos on
click me!

Recommended Stories