లక్ష రూపాయల ఎలక్ట్రిక్ స్కూటర్లు రూ.60 వేలకే..

First Published | Oct 29, 2024, 4:09 PM IST

దీపావళి అందరి ఇళ్లలో ఆనందం నింపాలని అనేక కంపెనీలు భారీ డిస్కౌంట్లతో ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే ప్రత్యేక ఆఫర్ హీరో కంపెనీకి చెందింది. హీరో మోటోకార్ప్ తన విడా V1 ప్లస్, V1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ తగ్గింపు ప్రకటించింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో అదనపు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. 

హీరో మోటోకార్ప్ అంటే ఎవరికీ పెద్దగా తెలియక పోవచ్చ కాని హీరోహోండా అంటే వెంటనే గుర్తుపడతారు. అయితే హీరోహోండా అనేది రెండు కంపెనీలు కలిసి వెహికల్స్ తయారు చేసి మార్కెట్ లో రిలీజ్ చేసేవి. భారత్ కు చెందిన హీరో కంపెనీ, జపాన్ కు చెందిన హోండా కంపెనీ 1984లో జాయింట్ వెంచర్ కోసం కలిశాయి. అంతకు ముందు వరకు హీరో కంపెనీ ఇండియాలో హీరో సైకిల్స్ తయారు చేసేది. హోండాతో కలిసి ఇండియాలో మోటార్ వెహికల్స్ తయారు చేసి విక్రయించడం ప్రారంభించింది. హీరో, హోండాలు కలిసి ఎన్నో రకాల వెహికల్స్ ను ప్రజలకు అందించాయి. అయితే 2012లో ఈ రెండు కంపెనీలు విడిపోయాయి. తర్వాత హీరో మోటోకార్ప్ ఏర్పడింది. ఈ సంస్థ నుంచి అనేక వెహికల్స్ వచ్చాయి. 

హీరో మోటోకార్ప్ లిమిటెడ్ ఢిల్లీలో ప్రధాన కార్యాలయం కలిగిన ఇండియన్ కార్పొరేట్ మోటార్‌సైకిల్, స్కూటర్ తయారీ సంస్థ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటి. భారతీయ ద్విచక్ర వాహన పరిశ్రమలో దాదాపు 46% మార్కెట్ వాటాను కలిగి ఉంది. 

దీపావళి సందర్భంగా హీరో మోటోకార్ప్ తన విడా V1 ప్లస్, V1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఈ రెండు స్కూటర్లు రెండు రిమూవబుల్ బ్యాటరీలను కలిగి ఉన్నాయి. డిజైన్, ఫీచర్ల పరంగా ఈ రెండు స్కూటర్లు అద్భుతంగా ఉన్నాయి.

హీరో విడా V1 ప్లస్ ధర రూ.1,02,700, విడా V1 ప్రో ధర రూ.1,30,200. ఈ రెండు స్కూటర్లపై కంపెనీ రూ.40,000 వరకు తగ్గింపును అందిస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో కూడా అదనపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఉచిత EMI, రూ.5,813 నుండి ప్రారంభమయ్యే EMIలు కూడా అందుబాటులో ఉన్నాయి.


హీరో విడా V1 ప్లస్ 3.44 kWh బ్యాటరీని, విడా V1 ప్రో 3.94 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. రెండు వేరియంట్లలో 6 kW ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. విడా V1 ప్లస్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 143 కి.మీ ప్రయాణిస్తుంది. అదే విడా V1 ప్రో అయితే 165 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. రెండు స్కూటర్ల గరిష్ట వేగం గంటకు 80 కి.మీ వరకు అందుకుంటాయి. దూర ప్రయాణాలకు కూడా ఈ రెండు వాహనాలు చాలా సౌకర్యంగా ఉంటాయి. ఈ  రెండు వాహనాల ఆఫర్ల గురించి మరింత సమాచారం కోసం దగ్గరలోని హీరో డీలర్‌షిప్‌ను సంప్రదించండి.

ఈ రెండు స్కూటర్లు ఒక నిమిషం ఛార్జింగ్‌తో 1.2 కి.మీ ప్రయాణిస్తాయి. హీరో విడా V1 స్కూటర్లు రెండు రిమూవబుల్ బ్యాటరీలతో నడుస్తాయి. అంటే ఆ బ్యాటరీలను తొలగించి ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉపయోగించే కరెంట్ ఉపయోగించి ఛార్జ్ చేసుకోవచ్చు. ఒక బ్యాటరీ ఛార్జింగ్ లో పెట్టి మరో బ్యాటరీ ఉపయోగించి మీరు ప్రయాణాలు చేయవచ్చు. దీని వల్ల మీ పనులకు ఆటంకం కలగకుండా ఉంటుంది. ఈ స్కూటర్ల గరిష్ట వేగాన్ని గంటకు 100 కి.మీ వరకు పెంచవచ్చు. ఇది 7 అంగుళాల TFT స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది డిజిటల్ డిస్‌ప్లే కలిగి ఉంది. స్మార్ట్ కనెక్ట్ ఫీచర్లతో నడిపే వారికి చాలా సౌకర్యంగా ఉంటుంది. 

విడా స్కూటర్ రివర్స్ అసిస్ట్, టూ-వే థ్రోటిల్, బూస్ట్ మోడ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. హీరో కంపెనీ పోర్టబుల్ ఛార్జర్‌ను అందిస్తోంది. దీని ద్వారా మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఛార్జ్ చేసుకోవచ్చు. బ్యాటరీ ప్యాక్ పోర్టబుల్ కాబట్టి దీన్ని తొలగించి ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్ డిజైన్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. చిన్న ఫ్యామిలీకి ఇది చాలా కంఫర్ట్‌బుల్‌గా ఉంటుంది. అమెజాన్, ఫ్లిక్ కార్ట్ లలో ధరలు పరిశీలించి మీకు నచ్చిన చోట కొనుక్కోండి.  

Latest Videos

click me!