టైల్స్ అంటే కేవలం ఫ్లోరింగ్ లోనే వేసేవి కావు. గోడలకు, రూఫింగ్ కు, బాత్రూమ్స్ కు వేర్వేరుగా ఉపయోగించే టైల్స్ ఉంటాయి. వీటిల్లోనూ డిజైన్ ఆధారంగా లివింగ్ రూమ్స్ లో వేరుగా, బెడ్ రూమ్స్ లో వేసేవి వేరుగా ఉంటాయి. సిరామిక్, పింగాణీ, పాలరాయి టైల్స్ అత్యంత మన్నికైన టైల్స్ గా మార్కెట్ లో గుర్తింపు పొందాయి.
లివింగ్ రూమ్స్, బెడ్ రూమ్స్ లో టెర్రకోట, ఇటాలియన్ మార్బుల్, పింగాణీ టైల్ రకాలను గోడలకు క్లాసిక్ ఎఫెక్ట్ తీసుకురావడానికి ఉపయోగిస్తారు. ఇంటి గోడల కోసం టైల్స్ స్టైలిష్ ఇంటీరియర్స్ లుక్ కోసం ఉపయోగించవచ్చు. మీరు మీ గదిని అలంకరించడానికి గోడ పలకలను ఉపయోగించాలనుకుంటే ముందుకు మీ గోడలు వాటర్ రెసిస్టెంట్ గా ఉన్నాయా లేదో తెలుసుకోండి. లీకేజీలు లేకుండా ఉండేలా టైల్స్ వేసుకోవడం చాలా ముఖ్యం.
వంటగది కోసం టైల్స్ ఎన్నుకునేటప్పుడు మరకలు, గీతలు పడకుండా నిరోధించే వాటిని ఎంపిక చేసుకోవాలి. సిరామిక్ టైల్స్ వంట గదికి బెస్ట్ ఆప్షన్.