Top Fuel Efficient Petrol Cars: ప్రస్తుత మార్కెట్ లో బెస్ట్ మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కార్లు ఇవే!

Naga Surya Phani Kumar | Published : Apr 2, 2025 4:28 PM

Top Fuel Efficient Petrol Cars: మీరు ఎక్కువ మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కారు కొనేందుకు చూస్తున్నారా? అయితే ఈ సమాచారం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కార్లలో టాప్ లో ఉన్న వాటి వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఓసారి పరిశీలించండి.   

16
Top Fuel Efficient Petrol Cars: ప్రస్తుత మార్కెట్ లో బెస్ట్ మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కార్లు ఇవే!

ఇండియాలో ఎక్కువ మంది మధ్య తరగతి వాళ్లే కార్లు ఉపయోగిస్తారు. అందుకే కార్ల తయారీ కంపెనీలు కూడా వారి అవసరాలకు తగ్గట్టుగా ఉండేలా కార్లను డిజైన్ చేస్తుంటాయి. ముఖ్యంగా మైలేజ్, ధర వారికి తగ్గట్టుగా ఉండేలా చూసుకుంటారు. అలా డిజైన్ చేసిన వాటిలో మార్కెట్ లో ఎక్కువ కొనుగోళ్లు జరిగిన కార్ల గురించి, వాటి మైలేజ్, ధరల వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఏప్రిల్ 2025 నాటికి బెస్ట్ మైలేజ్ కార్లుగా ఇవి నిలిచాయి. 

26

మారుతి సుజుకి సెలెరియో 

ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఉన్న కార్ల లిస్టులో ముందుండేది మారుతి సుజుకి సెలెరియో. ఇది నెక్స్ట్ జనరేషన్ K-సిరీస్ ఇంజిన్‌తో నడుస్తుంది. లేటెస్ట్ మోడల్ కారు దాదాపు 26 kmpl మైలేజ్ ఇస్తుంది.

36

మారుతి సుజుకి వేగన్ ఆర్

మారుతి సుజుకి వేగన్ ఆర్ దాని విశాలమైన ఇంటీరియర్ వల్ల ఎక్కువ మందికి ఫేవరేట్ కారుగా నిలిచింది. పెర్ఫార్మెన్స్ లో బెస్ట్ గా నిలుస్తోంది. ఇవి కాకుండా ఎక్కువ మైలేజ్ ఇస్తుండటం వల్ల ఇండియాలో హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో ఎక్కువ మంది ఇష్టపడే కారుగా నిలిచింది. ఈ కారు దాదాపు 25 kmpl మైలేజ్ ఇస్తుంది.

46

టొయోటా గ్లాంజా 

టొయోటా గ్లాంజా మోడల్ బేసిక్‌గా మారుతి సుజుకి బాలెనో రీబ్యాడ్జ్డ్ వెర్షన్. అందుకే ఇది బాగా జనానికి బాగా నచ్చుతోంది. టొయోటా కంపెనీ కార్లు నమ్మకమైన పర్ఫార్మెన్స్ ఇస్తాయి. అలాగే గ్లాంజా కూడా మంచి పనితీరును కనబరచడంతో పాటు ఎక్కువ ఎఫిషియన్సీని అందిస్తుంది. ఈ పెట్రోల్ కారు 23 కి.మీ. మైలేజ్ ఇస్తుంది. 

56

హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS

హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOSకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. దాని మోడ్రన్ డిజైన్, ఫీచర్స్ ఉన్న క్యాబిన్ వల్ల దీనికి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. అంతేకాకుండా ఇది ఎఫిషియంట్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ కారు దాదాపు 22 kmpl ఫ్యూయల్ ఎకానమీని ఇస్తుందని కంపెనీ ప్రకటించింది.

66

హ్యుందాయ్ ఆరా

హ్యుందాయ్ కంపెనీకి చెందిన చిన్న సెడాన్ మోడల్ ఆరా. ఇది కంఫర్ట్ లో బెస్ట్. తక్కువ ధరలో లభిస్తుంది. ఇంకా ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఎక్కువ. ఇన్ని ఫీచర్స్ ఉన్న బెస్ట్ కారు ఆరా. ఇది దాదాపు 22 kmpl మైలేజ్‌ ఇస్తూ మార్కెట్ లో  బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది. 

Read more Photos on
click me!