Gold: ఏంటి.. భూగర్భంలో మిగిలిన బంగారం 53 వేల టన్నులేనా? మరి ఇండియాలో ఎంత?

Published : May 21, 2025, 01:08 PM IST

Gold: ఇండియాలో బంగారం నిల్వలు తక్కువగా ఉన్నా.. వినియోగించడంలో మాత్రం ఇండియా ఎప్పుడు టాప్ లో ఉంటుంది. ఇటీవల విడుదలైన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక కూడా అదే చెప్తోంది. దాని ప్రకారం ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కువ బంగారు నిల్వలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
మిగిలింది 20 శాతం మాత్రమే..

2024 సంవత్సరానికి గాను ప్రపంచవ్యాప్తంగా భూగర్భ బంగారం నిల్వలపై విడుదలైన తాజా గణాంకాలను వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) వెల్లడించింది. వీటిలో భూగర్భంలో మిగిలి ఉన్న బంగారం మొత్తం 53 వేల టన్నులు మాత్రమేనని పేర్కొంది. అయితే ఇప్పటివరకు భూమి నుంచి వెలికితీసిన మొత్తం బంగారం ఎంతో తెలుసా? 2,01,296 టన్నులు. అంటే సుమారు 20% మాత్రమే బంగారం భూగర్భంలో మిగిలి ఉందన్నమాట.

25
ఆస్ట్రేలియాలోనే అత్యధికం

ఈ గణాంకాలను పరిశీలిస్తే వాటిలో 19% బంగారం కేవలం 10 దేశాల్లో భూగర్భంలో మిగిలి ఉంది.

భూగర్భ బంగారం నిల్వల పరంగా ఆస్ట్రేలియా 10 వేల టన్నులతో 19% వాటా కలిగి ఉంది. రెండవ స్థానంలో రష్యా ఉంది. ఇక్కడ 7.5 వేల టన్నుల బంగారం  నిల్వలు ఉన్నాయి. ఈ దేశం వాటా 14%. 

35
ఇతర దేశాల్లో 51 శాతం బంగారం నిల్వలు

ఆ తర్వాత స్థానంలో అమెరికా ఉంది. ఈ దేశంలో 3 వేల టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. ఇది మొత్తం బంగారు నిల్వల్లో 6%గా ఉంది. పెరూ, దక్షిణాఫ్రికా దేశాలు కూడా అత్యధికంగా బంగారం నిల్వలను కలిగి ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి 2.7 వేల టన్నులతో మొత్తం నిల్వల్లో 5% వాటాను కలిగి ఉన్నాయి. 

మిగిలిన దేశాలన్నింటిలో భూగర్భంలో మిగిలి ఉన్న బంగారం 27 వేల టన్నులు. ఇది మొత్తం భూగర్భ నిల్వల్లో 51% ఉంటుంది.

45
ఏ దేశం దగ్గర ఎంత బంగారం ఉంది?

ఇప్పటికే వెలికితీసిన బంగారం నిల్వలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయన్న సమాచారాన్ని కూడా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇచ్చింది. వాటి ప్రకారం అమెరికా ఏకంగా 8,133.46 టన్నులు బంగారం నిల్వలు కలిగి ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో జర్మనీ (3,351.53 టన్నులు), ఇటలీ (2,451.84 టన్నులు), ఫ్రాన్స్ (2,436.94 టన్నులు), చైనా (2,264.32 టన్నులు) ఉన్నాయి.

55
భారత్ స్థానం ఎంతో తెలుసా?

భారత్ 853.63 టన్నులతో ఏడవ స్థానంలో నిలిచింది. జపాన్ 845.97 టన్నులు, టైవాన్-చైనా 422.69 టన్నులు, పోలాండ్ 419.70 టన్నులతో టాప్-10 దేశాల్లో ఉన్నాయి.

ఈ గణాంకాలు చూస్తుంటే భవిష్యత్‌లో బంగారం వెలికితీత, గోల్డ్ మార్కెట్‌ పరిస్థితులపై ఈ భూగర్భ నిల్వలు ఎంత ప్రభావం చూపుతాయో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. 

Read more Photos on
click me!

Recommended Stories