Gold: మ‌రో భారీ ఆర్థిక సంక్షోభం.. గోల్డ్, సిల్వ‌ర్ దాచుకోండి.. రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత కియోసాకి హెచ్చ‌రిక‌లు

Published : May 20, 2025, 06:24 PM IST

Robert Kiyosaki warns of 2025 crash: రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రోబర్ట్ కియోసాకి 2025లో భారీ ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశముందని హెచ్చరించారు. నకిలీ కరెన్సీ బదులుగా రియ‌ల్ బంగారం, వెండి, బిట్‌కాయిన్‌ను దాచుకోవాలని సూచించారు. 

PREV
16
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రోబర్ట్ కియోసాకి వార్నింగ్

Robert Kiyosaki warns of 2025 crash: ప్రఖ్యాత రచయిత రిచ్ డాడ్ పూర్ డాడ్ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రోబర్ట్ కియోసాకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరోసారి తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా 2025లో భారీ స్థాయి ఆర్థిక సంక్షోభం వచ్చే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. “25 సంవత్సరాల క్రితమే నేను చెప్పినట్టు.. ధనవంతులు డబ్బు కోసం పనిచేయరు, పొదుపుదారులు ఓడిపోతారు” అని కియోసాకి తన ఎక్స్ ఖాతాలో వ్యాఖ్యానించారు.

26
మరో పెద్ద ఆర్థిక సంక్షోభం రానుందా?

ఆర్థిక చరిత్రలో కీలక ఘట్టాలను గుర్తు చేస్తూ ఆయన 1998లో LTCM (Long-Term Capital Management) రక్షణకు వాల్ స్ట్రీట్ ఇచ్చిన మద్దతు, 2008లో వాల్ స్ట్రీట్‌కు కేంద్ర బ్యాంకుల ఇచ్చిన సహాయాన్ని ప్రస్తావించారు. “ఇప్పుడు 2025లో నా మిత్రుడు జిమ్ రికార్డ్స్ అడుగుతున్నాడు.. ఈసారి కేంద్ర బ్యాంకులకు సహాయం చేసే వారు ఎవరు?” అని ప్రశ్నించారు.

36
అమెరికన్ డాలర్‌ను బంగారం ప్రామాణికం నుంచి తొలగించడం నుంచే సమస్యలు

1971లో అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ అమెరికన్ డాలర్‌ను బంగారం ప్రామాణికం నుంచి తొలగించడం నుంచే ఈ సమస్యలు ప్రారంభమయ్యాయని కియోసాకి అభిప్రాయపడ్డారు. జిమ్ రికార్డ్స్ అభిప్రాయాన్ని పునరుద్ఘాటిస్తూ, $1.6 ట్రిలియన్ డాలర్ల విద్యార్థి రుణ మార్కెట్ పతనమవడం వల్ల తదుపరి సంక్షోభం ప్రారంభమయ్యే అవకాశముందని హెచ్చరించారు.

46
బంగారం, వెండి దాచుకోండి

క్రయపత్రాలు (ETFs)లాంటివి కాకుండా, నిజమైన బంగారం, వెండి, బిట్‌కాయిన్‌ను భద్రపరచుకోవాలని ప్రజలకు సూచించారు. “మీరు స్వయంగా మీ కుటుంబాన్ని రక్షించుకోవాలి. ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూడవద్దు,” అని కియోసాకి చెప్పారు.

56
నకిలీ ఫియట్ కరెన్సీని పొదుపుతో లాభం లేదు

“నకిలీ ఫియట్ కరెన్సీని పొదుపు చేయడం ఇక సురక్షితమైన మార్గం కాదు” అని ఆయన స్పష్టం చేశారు. “2021లో Rich Dad’s Prophecyలో నేను చెప్పిన క్రాష్ ఇప్పటికే ప్రారంభమైంది. జాగ్రత్తగా ఉండండి. మీరు మిమ్మ‌ల్ని రక్షించుకోండి” అంటూ తన హెచ్చరికలో పేర్కొన్నారు.

66
కాగితాలుగా ఉన్న పెట్టుబడుల కంటే అవే ఉత్తమం

ఆర్థిక సంక్షోభాల్లో బంగారం, వెండి, బిట్‌కాయిన్ లాంటి అసలైన సంపదలు మాత్రమే మన సంపదను కాపాడగలవని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. "మీరు స్వయంగా మీ కుటుంబాన్ని రక్షించుకోవాలి. ప్రభుత్వాలపై ఆశపెట్టకండి" అని చెప్పారు. ముఖ్యంగా ETFs (ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్) లాంటి కాగితాలుగా ఉన్న పెట్టుబడుల కంటే, నిజమైన బంగారం, వెండి లేదా స్వతంత్రంగా నిర్వహించదగిన బిట్‌కాయిన్ లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు.

Read more Photos on
click me!