చైనాయుల తిండి గురించి ఎప్పుడూ వార్తలు వస్తూనే ఉంటాయి. భూమిపై ఉన్న అన్ని జంతువులను తినే వారు చైనా వారేనని చెప్పుకుంటారు. ఇప్పుడు వారు బాతులకు బదులుగా పందులను అధికంగా తింటున్నారు. దాని ఫలితంగా భారతదేశంలో షటిల్ కాక్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
చైనా ఆహారపు అలవాట్లు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పాములు, పురుగులు, గబ్బిలాలను కూడా వారు తింటారని అంటారు. అయితే చైనాలో అత్యంత ఇష్టంగా తినేది బాతు మాంసం. వారు బాతు మాంసం తిన్నంతకాలం మనకి షటిల్ కాక్ లకు ఎలాంటి కొదవ లేకుండా పోయింది. కానీ ఇప్పుడు వారు బాతు మాంసం తినడం తగ్గించేశారు. పందులను అధికంగా తింటున్నారు. దీనివల్ల మనదేశంలో బ్యాడ్మింటన్ ఆటకు కష్టకాలం మొదలైంది. గత ఏడాదిన్నరగా బాతు ఈకలతో చేసిన షటిల్ కాక్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మనదేశంలో ఉన్న బ్యాడ్మింటన్ అకాడమీలు ఈ విషయంలో ఆందోళనగా ఉన్నాయి.
25
షటిల్ కాక్ ధర ఎంత పెరిగింది?
గత ఏడాది ఒక షటిల్ కాక్ ధర 1200 రూపాయలు ఉండేది. ఈ ఏడాది బెంగళూరుకు చెందిన ఒక కోచ్ దానిని తిరిగి ఆర్డర్ చేశాడు. అయితే దాని ద్వారా 2,700 రూపాయలుగా చూపించింది. ఈ సంవత్సరం చివరినాటికి అది 3000 రూపాయలకు కూడా చేరుకోవచ్చు. చైనాలో బాతులు పెంచడం తగ్గిపోవడం వల్లే ఈకల కొరత ఏర్పడింది. ఆ ఈకల కొరత వల్ల షటిల్ కాక్ ధరలు పెరిగిపోయాయి. భారతదేశం, చైనా, ఇండోనేషియా దేశాల్లో బ్యాడ్మింటన్ ఆటకు ఆదరణ పెరుగుతుంది. అందుకే బాతు ఈకల తక్కువ అవడంతో షటిల్ కాక్ ధరలు ఆ దేశాల్లో అధికంగా పెరిగిపోతున్నాయి.
35
బాతులే ఎందుకు?
అధిక నాణ్యత గల షటిల్ కాక్ లలో బాతు ఈకలను ఉపయోగిస్తారు. ఎందుకంటే అవి బలంగా ఉంటాయి. ఎక్కువ కాలం మన్నుతాయి. చైనీస్ వారు బాతు మాంసాన్ని అధికంగా తింటారు. అలా తిన్నప్పుడు వారు ఈకలను తీసి వాటిని శుభ్రం చేసి షటిల్ కాక్ ల తయారీకి ముడి పదార్థంగా అమ్ముతారు. ఎప్పుడైతే వారు బాతు మాంసాన్ని తినడం తగ్గించేశారు. ఆ పక్షులను పెంచడం కూడా తక్కువగా అయిపోయింది. దీంతో బాతు ఈకలు దొరకడం కష్టంగా మారింది. అప్పుడు నుంచి షటిల్ కాక్ ల ఉత్పత్తి ప్రభావితమైంది.
45
షటిల్ అకాడమీలపై భారం
భారతదేశంలోని షటిల్ కోచ్ లు మాట్లాడుతూ చాలాచోట్ల షటిల్ కాక్‌లు స్టాక్ కూడా లేదని చెబుతున్నారు. దీంతో అకాడమీలా ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంది. సాధారణ షటిల్ కాక్ ధర 1200 రూపాయలు నుండి 1700కి పెరిగింది. ఆ తర్వాత 2,250 రూపాయలకి వెళ్ళింది. ఇక ఈ ఏడాది 2,700కి పెరిగినట్టు షటిల్ కోచ్ లు చెబుతున్నారు. దీంతో అకాడమీ నెలవారీ ఖర్చులు ఒక 50,000 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది.
55
ఇకపై ధనవంతుల ఆట
పరిస్థితి ఇలాగే ఉంటే బ్యాడ్మింటన్ అనేది ధనవంతుల ఆటగా మారిపోతుంది. సామాన్యులు బ్యాడ్మింటన్ నేర్చుకోవడానికి వచ్చే అవకాశం చాలా తగ్గిపోతుంది. ఈ విషయంలో భారత ప్రభుత్వం దిగుమతి సుంకాలను తగ్గించడం, సబ్సిడీలు ఇవ్వడం ద్వారా కొంతవరకు పరిస్థితిని చక్కదిద్దవచ్చని కోచ్‌లు అభిప్రాయపడుతున్నారు. అలాగే బ్యాడ్మింటన్ ఆట నేర్చుకుంటున్న ఆటగాళ్లపై ఆర్థిక ఒత్తిడి తగ్గించేందుకు కూడా భారతదేశం కృషి చేయాల్సి ఉంటుందని కోచ్‌లు అభిప్రాయపడుతున్నారు.