అమెరికన్ డాలర్... ఇదేే ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీగా మనం భావిస్తుంటాం. కానీ ప్రపంచంలో ఈ యూఎస్ డాలర్ పదో బలమైన కరెన్సీ. మరి అత్యంత బలమైన కరెన్సీ ఏ దేశానిదంటే...
TOP 5 Strongest Currencies : ప్రపంచంలో బాగా అభివృద్ది చెందిన దేశం ఏదంటే టక్కున వినిపించే పేరు అమెరికా. ప్రపంచానికి పెద్దన్నలా వ్యవహరిస్తున్న అమెరికా అన్ని రంగాల్లోనూ టాప్ లో వుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన దేశం అమెరికా. కాబట్టి సహజంగానే అమెరికా కరెన్సీ డాలర్ ప్రపంచంలోనే అత్యంత విలువైనదిగా భావిస్తాం. కానీ నిజానికి డాలర్ కంటే విలువైన కరెన్సీ కలిగిన దేశాలు చాలా వున్నాయి. ఆ దేశాలు, కరెన్సీ విలువ గురించి తెలుసుకుందాం.
27
TOP 5 Strongest Currencies
కువైట్ దినార్ :
ప్రపంచంలో అత్యధిక క్రూడాయిల్ నిల్వలున్న దేశాల్లో కువైట్ ఒకటి. ఈ దేశం సౌది అరేబియా, ఇరాక్ మధ్య వుంటుంది. ఇక్కడి నుండే ప్రపంచ దేశాలకు అత్యధికంగా ఆయిల్ సరఫరా దేశం కువైట్. ఈ దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచస్థాయికి చేర్చింది ఈ ఆయిల్ నిల్వలే. ప్రస్తుతం ఈ దేశ కరెన్సీ కువైట్ దినార్ ప్రపంచంలోనే అత్యంత విలువైనది.
ఒక కువైట్ దినార్ విలువ 3.26 డాలర్లతో సమానం. మన భారత కరెన్సీలో చూసుకుంటే ఈ దినార్ 272.76 రూపాయలతో సమానం. అందువల్లే మన దేశంనుండి చాలామంది కువైట్ వెళ్లి పనిచేస్తుంటారు.
37
TOP 5 Strongest Currencies
బహ్రెయిన్ దినార్ :
ఈ దేశ కరెన్సీ కూడా దినారే. బహ్రెయిన్ దినార్ కువైట్ కరెన్సీ కంటే తక్కువ విలువ కలిగివుంటుంది... కానీ ప్రపంచంలో ఇది రెండో విలువైన కరెన్సీ. ఒక్క బహ్రెయిన్ దినార్ 2.65 అమెరికన్ డాలర్లతో సమానం. ఇక 1 బహ్రెయిన్ దినార్ భారత కరెన్సీ 222.15 రూపాయలతో సమానం.
కువైట్ లాగే బహ్రెయిన్ కు కూడా క్రూడాయిల్ ఎగుమతులే ప్రధాన ఆదాయం. ప్రపంచానికి ఎక్కువగా ఆయిల్,గ్యాస్ సరఫరా చేసే దేశాల్లో బహ్రెయిన్ ఒకటి.
47
TOP 5 Strongest Currencies
ఒమన్ రియాల్ :
ప్రపంచంలో మూడో బలమైన కరెన్సీ ఒమన్ రియాల్. ఒక్క ఒమన్ రియాల్ 2.59 అమెరికన్ డాలర్లతో సమానం. అంటే భారత కరెన్సీ 216.94 రూపాయలు ఒక్క ఒమన్ రియాల్ విలువను కలిగివుంటాయి. ఈ దేశ ఆదాయ వనరులు కూడా ఆయిల్ సరఫరానే.
57
TOP 5 Strongest Currencies
జోర్డానియన్ దినార్ :
సముద్ర తీరం లేకుండా చుట్టూ ఇతర దేశాలతో సరిహద్దులు కలిగిన దేశం జోర్డాన్. ఈజిప్ట్, సిరియా, ఇరాక్, సౌదీ అరేబియా దేశాల మధ్య ఈ జోర్డాన్ వుంటుంది. ఈ దేశంలో కూడా ఆయిల్ నిల్వలు పుష్కలంగా వున్నాయి. దీంతో ఈ దేశ ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా వుంది.
ఒక్క జోర్డాన్ దినార్ విలువ 1.41 అమెరికన్ డాలర్లతో సమానం. రూపాయలతో పోల్చితే ఒక్క జోర్డాన్ దినార్ 117.83 రూపాయలతో సమానం.
67
TOP 5 Strongest Currencies
బ్రిటీష్ పౌండ్ :
యునైటెడ్ కింగ్డమ్ కరెన్సీ పౌండ్ అమెరికన్ డాలర్ కంటే విలువైనది. బ్రిటిష్ పౌండ్ ప్రపంచంలోనే ఐదో బలమైన కరెన్సీ. ఒక్క బ్రిటీష్ పౌండ్ 1.29 అమెరికన్ డాలర్లతో, 108.38 భారత రూపాయలతో సమానం.
77
TOP 5 Strongest Currencies
ఈ దేశాల కరెన్సీ మాత్రమే కాదు జీబ్రాల్టర్ పౌండ్, సీమన్ ఐస్లాండ్ డాలర్, స్విస్ ఫ్రాంక్, యూరో కూడా అమెరికన్ డాలర్ కంటే బలమైనవే. ప్రపంచంలో పదో బలమైన కరెన్సీ అమెరికన్ డాలర్.