free schemes
ప్రజలకు ఉపాధి కల్పించకుండా సంక్షేమం పేరుతో ఉచితంగా డబ్బులు పంపిణీ చేయడానికి ప్రభుత్వాలు అలవాటు పడుతున్నాయి. దీంతో చదువుకున్న యువత సైతం ఉపాధి కల్పనకు ప్రయత్నించ కుండా ప్రభుత్వాలు ఇచ్చే ఉచితాలకు అలవాటు పడుతోంది. ఈ పరిస్థితికి ప్రధాన కారణం ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాలే అనడంలో సందేహం లేదు. అయితే ఉచిత పథకాలు సమాజ అభివృద్ధికి ఎలా అడ్డుపడుతున్నాయో... అమెరికాలో open research అనే సంస్థ ఈ అంశంపై సర్వే నిర్వహించింది. ఆ వివరాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం....
free schemes
Open research ఏం చేసిందంటే...
Open AI మరియు US ప్రభుత్వం వంటి సంస్థల నుంచి నిధులు సేకరించింది. వాటిని అమెరికాలో కొందరు పేదలను ఎంపిక చేసి మూడు సంవత్సరాల పాటు నెలకు $1,000 ఇచ్చింది. నవంబర్ 2020 నుండి అక్టోబర్ 2023 వరకు ఈ నగదు అందజేసింది. వారు ఆ డబ్బును ఆహారం, గృహాలు మరియు రవాణా వంటి ప్రాథమిక అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగించారు. కానీ వారి ఆరోగ్యం లేదా దీర్ఘకాలిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ఉపయోగించలేకపోయారు. మూడు సంవత్సరాల్లో ఇచ్చిన $36,000 వారికి నిత్య అవసరాలు తీర్చుకోవడానికి తప్ప, ఇతర ముఖ్య అవసరాలకు ఉపయోగపడలేదని పరిశోధకులు నిర్ధారించారు.
free schemes
పెట్టుబడి పెట్టరు... పనిచేయరు...
ఉచిత నగదు తీసుకోవడానికి అలవాటు పడిన అమెరికా ప్రజలు భవిష్యత్తులో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపరని, చివరికి పూర్తిగా ఉద్యోగాలను, పనులను వదులుకుంటారని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఉచిత నగదు పై పూర్తిగా ఆధారపడతారని తెలిపారు. OpenResearch బృందం తన పరిశీలనలో ఈ విషయాలను వెల్లడించింది.
free schemes
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితాలపై ఆలోచించాలి....
మనదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ఉచిత నగదు బదిలీ పథకాలను అమలు చేస్తున్నాయి. వృద్ధులు, వికలాంగులకు వీటిని ఇవ్వడంలో తప్పులేదు కానీ... కష్టపడి పనిచేసే యువతకు సైతం ఇలాంటి నగదు బదిలీ పథకాలు అందిస్తుండడం ఆందోళనకరం. వారికి నిరుద్యోగ భృతి ఇచ్చే బదులు స్వయం ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేగంగా పడాల్సిన అవసరం ఉంది.
ఉచితాలపై ఆసక్తి చూపిన యువత...
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకు యువత ఇదే విషయాన్ని వెల్లడించింది. తమకు ఉచిత పథకాలు వద్దని, ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని నాయకులను కోరారు. రాష్ట్రంలో గత వైసిపి ప్రభుత్వం అనేక ఉచిత నగదు బదిలీ పథకాలు అమలు చేసినప్పటికీ ఉద్యోగాలు కల్పించిన కారణంగా యువత తిరస్కరించారు. తెదేపా ఇచ్చిన మెగా డీఎస్సీ హామీ యువతను ఎంతో ఆకట్టుకుంది. దీంతో అత్యధిక(163) సీట్లతో ఆ పార్టీ గెలుపొందింది. అమెరికా సర్వే సంస్థ open research వెల్లడించిన ఫలితాలను దృష్టిలో పెట్టుకుని ఉచిత నగదు బదిలీ పథకాల కంటే ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.