చాలామంది వ్యాపారం చేయాలి అనుకుంటారు. కానీ పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టలేక వెనకడుగు వేస్తుంటారు. అయితే కొన్ని వ్యాపారాల్లో చిన్న పెట్టుబడితో కూడా ఎక్కువ లాభాలు పొందవచ్చు. అది కూడా ఇంట్లో నుంచే. ముఖ్యంగా మహిళలకు ఈ బిజినెస్ ఐడియాస్ చక్కగా ఉపయోగపడతాయి.
ప్రస్తుత రోజుల్లో చాలామంది మహిళలు వ్యాపారం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇంటిని చక్కబెట్టుకోవడంతో పాటు అదనపు ఆదాయాన్ని కూడా పొందాలనుకుంటున్నారు. సరిగ్గా అలాంటి వారికోసమే కొన్ని వ్యాపార ఆలోచనలు ఇక్కడ ఉన్నాయి. వీటికి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం పొందవచ్చు. మహిళలకు అనువైన కొన్ని వ్యాపారాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
26
అలంకరణ వస్తువులు
అలంకరణ వస్తువులు ఇంటి అందాన్ని పెంచుతాయి. ప్రస్తుతం మార్కెట్ లో వీటికి మంచి డిమాండ్ ఉంది. కాబట్టి పెయింటింగ్ లు, విగ్రహాలు, ఫ్లవర్ వాస్ ల వం టి అలంకరణ వస్తువులు తయారు చేయవచ్చు. పండుగలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పూజల సమయాల్లో వీటిని ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తుంటారు. ఈ వ్యాపారానికి రూ. 2,000 నుంచి రూ.5,000 వరకు పెట్టుబడి సరిపోతుంది. నెలకు రూ. 20 వేల నుంచి 30 వేల వరకు సంపాదించవచ్చు.
36
బ్యూటీ ప్రొడక్టులు
సహజ మూలికలతో హెయిర్ ఆయిల్స్, ఫేస్ క్రీమ్స్, పౌడర్ వంటి వాటిని ఇంట్లోనే తయారు చేసి విక్రయించవచ్చు. సహజ ఉత్పత్తులకు ఎప్పుడూ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. ఒక్కసారి కస్టమర్లకు మీ ప్రొడక్టు నచ్చితే.. మీరు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం ఉండదు. ఈ వ్యాపారానికి పెట్టుబడి రూ.3,000 – రూ.7,000 సరిపోతుంది. ప్రతి వస్తువుపై కనీసం 40% లాభం వస్తుంది.
ప్రస్తుతం చాలామంది రకరకాల కారణాలతో బయటి ఫుడ్ ఎక్కువగా తింటున్నారు. కాబట్టి పిండి పదార్థాలు, కేక్స్, బిస్కెట్స్, పచ్చళ్ల వంటి వాటిని ఇంట్లోనే తయారు చేసి అమ్మవచ్చు. ఆన్‌లైన్ ఆర్డర్స్ కూడా తీసుకోవచ్చు. ఈ వ్యాపారానికి పెట్టుబడి రూ.10,000 – రూ.20,000 వరకు అవుతుంది. నెలకు రూ. 40,000 వరకు సంపాదించవచ్చు.
56
ఎక్కువ డిమాండ్ ఉన్న వస్తువులను..
మీరు ఉండే ప్రాంతంలో ఎక్కువ డిమాండ్ ఉన్న వస్తువులను ఎంచుకొని వాటిని హోల్ సేల్ లో కొని.. రిటైల్ గా అమ్ముకోవచ్చు. అయితే వస్తువును బట్టి ఆదాయం మారుతుంటుంది. ఈ వ్యాపారానికి రూ.5,000 – రూ.15,000 వరకు పెట్టుబడి అవుతుంది. నెలకు రూ.30 వేల వరకు సంపాదించవచ్చు.
66
ప్లే స్కూల్..
చిన్న స్థాయిలో 3–6 సంవత్సరాల పిల్లల కోసం ప్లే స్కూల్ లేదా డే కేర్ ప్రారంభించవచ్చు. చదువు + ఆటల పద్ధతిలో నిర్వహిస్తే తల్లిదండ్రులకు నమ్మకం కుదురుతుంది. దీనికి పెట్టుబడి రూ.15,000 – రూ.25,000 వరకు అవుతుంది. నెలకు రూ.40,000 – రూ.60,000 వరకు సంపాదించవచ్చు.