రిలయన్స్ జియో ప్రపంచంలోనే నెంబర్ వన్ టెలికాం సంస్థగా రికార్డు సృష్టించింది. దీనికే ఇప్పుడు ఎక్కువ మంది వినియోగదారులు ఉన్నారు. ముకేశ్ అంబానీ కుటుంబానికి ఇది ఎంతో సంతోషాన్ని ఇచ్చే వార్త.
ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో రికార్డు సృష్టించింది. ప్రపంచంలో ఉన్న అన్ని టెలికాం ఆపరేటర్లలో అత్యంత విజయవంతమైన టెలికాం సంస్థగా నిలిచింది. ఇప్పుడు జియో ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆపరేటర్. రిలయన్స్ జియో అనేక ఆఫర్లు, తక్కువ రీఛార్జ్, ఎక్కువ డేటా వంటి అనేక సదుపాయాలతో పెద్ద సంఖ్యలో వినియోగదారులను సంపాదించింది. జియో పెట్టే ప్రత్యేక ఆఫర్లు వినియోగదారులను ఎంతో ఆకర్షించాయి. 5జీ సర్వీసు ఇవ్వడం, మంచి నెట్వర్క్ ను అందించడంతో వినియోగదారులు జియో వైపు మొగ్గు చూపారు.
25
అన్నింటినీ మించిపోయి
జియో ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద టెలికాం ఆపరేటర్ గా మారింది. అత్యధిక వినియోగదారులతో అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించింది. చైనా, అమెరికా వంటి అగ్రరాజ్యాల టెలికాం నెట్వర్కులు కూడా అధిగమించి ఎక్కువ మంది వినియోగదారులను సాధించింది. ప్రస్తుతం జియోకు 488 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇక వీరిలో 191 మిలియన్ దారులు 5జీ కస్టమర్లు.
35
అమెరికా సంస్థ కూడా ఓడిపోయింది
అమెరికాలో ప్రసిద్ధ టెలికాం సంస్థ టీ మొబైల్. దీనికే ఎక్కువ మంది వినియోగదారులు ఉండేవారు. ఇప్పుడు దీనిని జియో అధిగమించింది. రిలయన్స్ జియో 5జి విస్తరించుకుంటూ పోతోంది. ప్రస్తుతం 191మిలియన్ల కస్టమర్లే ఉన్నారు. ఆ సంఖ్యను మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. జియో 5జీ సేవలు మనదేశంలోని 17 నగరాల్లో అందుతున్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించాలని రిలయన్స్ యోచిస్తోంది. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి హై స్పీడ్ నెట్వర్క్ ను అందించడమే జియో లక్ష్యంగా పెట్టుకోండి.
45
ఇకపై 6జీ సేవలు కూడా
భారతదేశంలో డేటా ఇంటర్నెట్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన సంస్థగా రిలయన్స్ జియో సంచలనం సృష్టించింది. ఇది ప్రస్తుతం ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించేందుకు కూడా సిద్ధమవుతోంది. ఉపగ్రహ సేవల ద్వారా హై స్పీడ్ 6జీ ఇంటర్నెట్ సేవలను ఇవ్వాలని కూడా ప్రయత్నం చేస్తోంది.
55
జియో చరిత్ర
జియో నెట్ వర్క్ అనేది2010లో ప్రారంభమైంది. కానీ ప్రజలకు సేవలు అందించడం మొదలైంది మాత్రం 2016లో. చవకైన డేటా, ఉచిత వాయిస్ కాల్స్ వల్ల జియో త్వరగానే వినియోగదారులకు ఆకర్షించింది. ఇది భారతీయ టెలికాం రంగంలో విప్లవాన్ని సృష్టించింది. ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ వన్ సంస్థగా ఎదిగింది.