Business Ideas : కేవలం రూ.10000 పెట్టుబడితో నెలకు రూ.30000 సంపాదించే.. ట్రెండింగ్ బిజినెస్‌ ఐడియాలు

Published : Oct 08, 2026, 02:23 PM IST

మీ దగ్గర రూ.10,000 ఉంటే చాలు… బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. మధ్యతరగతి వాళ్లకు సరిపోయే ట్రెండింగ్ బిజినెస్ ఐడియాలను ఇక్కడ అందిస్తున్నాం. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇంట్లో నుండే ఈ బిజినెస్ లు చేయవచ్చు.

PREV
16
నేరుగా లాభాలు ఇచ్చే బిజినెస్‌ల

చాలామంది పెట్టుబడికి డబ్బులు లేక బిజినెస్ చేయాలన్న ఆసక్తి ఉన్నా వెనకడుగు వేస్తుంటారు. కానీ ఇప్పుడు ట్రెండ్ అవుతున్న కొన్ని బిజినెస్‌లు మధ్యతరగతి వాళ్లకు నేరుగా లాభాలు తెచ్చిపెడుతున్నాయి. వీటికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదు… చేతిలో రూ.10,000 ఉన్నా సరే సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అదికూడా ఇంట్లో నుంచే చేసుకోవచ్చు. లోకల్ డిమాండ్‌ను బట్టి వెంటనే డబ్బులు సంపాదించుకోవచ్చు.

26
ఇంటి భోజనం.. టిఫిన్ సర్వీస్

మొదటిది… ఇంట్లో వండే భోజనం లేదా టిఫిన్ సర్వీస్. ఇప్పుడు ఆఫీసులకు వెళ్లేవాళ్లు, స్టూడెంట్స్, బ్యాచిలర్స్ అంతా ఇంటి భోజనం కోసమే వెతుకుతున్నారు. మీరు రూ.5,000 నుంచి రూ.8,000 పెట్టి గిన్నెలు, ప్యాకింగ్ కవర్లు, సరుకులు కొంటే చాలు… ఈ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు.

రోజుకు 10-15 మందికి రూ.80-100 ధరకు టిఫిన్స్, భోజనం అందించినా నెలకు రూ.25,000 నుంచి రూ.40,000 వరకు సంపాదించొచ్చు. వాట్సాప్ గ్రూపుల్లో చిన్న మెసేజ్ పెడితే చాలు. రుచి, శుభ్రత, టైమ్ పాటిస్తే కస్టమర్లు వాళ్లంతట వాళ్లే వస్తారు.

36
సరుకు నిల్వ లేకుండా రీసెల్లింగ్

రెండోది… సరుకు నిల్వ చేయాల్సిన పనిలేని రీసెల్లింగ్ బిజినెస్. మీషో, గ్లోరోడ్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మీరు వస్తువులను అమ్మొచ్చు. ముందుగా రూ.1,000-2,000 పెట్టి శాంపిల్స్ తెప్పించుకుని క్వాలిటీ చెక్ చేయండి. ఆ తర్వాత ఆర్డర్ వస్తే సప్లయర్ నేరుగా కస్టమర్‌కు పంపిస్తాడు. మీరు కేవలం లాభం తీసుకుంటే చాలు.

బట్టలు, ఇంటి వస్తువులు, బ్యూటీ ప్రొడక్ట్స్‌కు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా మధ్యతరగతి మహిళలు ఇంట్లో నుంచే నెలకు రూ.15,000-30,000 సంపాదించవచ్చు. రోజూ రీల్స్ పెట్టి కస్టమర్లను ఆకర్షించండి.

46
చిన్న షాపులకు సోషల్ మీడియా, AI సర్వీస్

మూడోది… చిన్న షాపులకు సోషల్ మీడియా, AI సర్వీస్ అందించడం. లోకల్ కిరాణా షాపులు, టీ స్టాల్స్, ట్యూషన్ సెంటర్ల వాళ్లకు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ఎలా వాడాలో పెద్దగా తెలియదు. మీరు కాన్వా, ఉచిత AI టూల్స్ వాడి వాళ్లకు పోస్టులు, రీల్స్ చేసి పెడితే నెలకు రూ.5,000-10,000 వరకు ఛార్జ్ చేయొచ్చు. రూ.2,000-3,000 పెట్టి ఫోన్, ఇంటర్నెట్ తీసుకుంటే చాలు. ఇది కొత్త ట్రెండ్. చిన్న వ్యాపారులకు నేరుగా సాయం చేయడం వల్ల వాళ్లకు మీపై నమ్మకం పెరుగుతుంది.

56
ఇంట్లో తయారు చేసే ఫుడ్ ప్రొడక్ట్స్

నాలుగోది… ఇంట్లో తయారు చేసే ఫుడ్ ప్రొడక్ట్స్. అంటే పచ్చళ్లు, చిప్స్, మిల్లెట్ స్నాక్స్ లాంటివి. ఇప్పుడు ఆరోగ్యంపై అందరికీ శ్రద్ధ పెరిగింది కాబట్టి ఇవి త్వరగా అమ్ముడవుతాయి. రూ.6,000-8,000 పెట్టి ముడిసరుకు, ప్యాకింగ్ కవర్లు కొని బిజినెస్ మొదలుపెట్టొచ్చు. లోకల్ మార్కెట్, వాట్సాప్, ONDC ద్వారా వీటిని అమ్మొచ్చు. ఒక్కసారి క్వాలిటీ నచ్చితే కస్టమర్ల నుంచి ఆర్డర్లు వస్తూనే ఉంటాయి.

66
ఆన్‌లైన్ ట్యూషన్ లేదా స్కిల్ ట్రైనింగ్

ఐదోది… ఆన్‌లైన్ ట్యూషన్ లేదా స్కిల్ ట్రైనింగ్. ఇంగ్లీష్, మ్యాథ్స్, కోడింగ్ లేదా యోగా లాంటివి నేర్పించొచ్చు. రూ.3,000-5,000 పెట్టి మైక్, లైట్ కొంటే చాలు. జూమ్ లేదా గూగుల్ మీట్ ద్వారా క్లాసులు చెప్పొచ్చు. స్టూడెంట్స్ ఎక్కువగా ఇలాంటి వాటి కోసమే వెతుకుతున్నారు. గంటకు రూ.300-500 ఛార్జ్ చేసినా మంచి ఆదాయం వస్తుంది.

పెద్ద షాపు, స్టాఫ్ అవసరం లేదు

ఇవన్నీ కొత్తగా ట్రెండ్ అవుతున్న బిజినెస్‌లు. వీటికి పెద్ద షాపు అద్దెకు తీసుకోవాల్సిన పనిలేదు, స్టాఫ్ కూడా అవసరం లేదు. వాట్సాప్ బిజినెస్, ఇన్‌స్టాగ్రామ్, ఉచిత డిజిటల్ టూల్స్ ఉంటే చాలు.

అయితే ఒకే ఐడియా పట్టుకుని కూర్చోకండి. లోకల్ డిమాండ్ ఎలా ఉందో చూడండి. ముందుగా 2-3 కస్టమర్లతో టెస్ట్ చేసి, ఆ తర్వాత బిజినెస్ పెంచండి. మొదటి నెల లాభం తక్కువగా ఉన్నా, ఐదారు నెలలు కంటిన్యూ చేస్తే స్థిరమైన ఆదాయం వస్తుంది. రూ.10,000 అనేది కేవలం ఆరంభం మాత్రమే. దాన్ని సరిగ్గా వాడితే నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లొచ్చు. ఈరోజే స్టార్ట్ చేయండి.

Read more Photos on
click me!

Recommended Stories